CSK Vs GT IPL 2023: క్షణాల్లో మ్యాచ్ మార్చేసే వీరులు.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి..!
Chennai Super Kings Vs Gujarat Titans Live Updates: చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్ కైవసం చేసుకుంటుందా..? డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ నిలబెట్టుకుంటుందా..? ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఐపీఎల్ 2023 విజేత ఎవరో తేలిపోనుంది.
Chennai Super Kings Vs Gujarat Titans Live Updates: ఐపీఎల్ 2023 ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. నాలుగు సార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ సై అంటూ పోరుకు రెడీ అయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. రెండు జట్లు పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచాయి. క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించి చెన్నై ఫైనల్‌కు చేరుకోగా.. క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ముంబైను మట్టికరిపించి గుజరాత్ వరుసగా రెండో ఏడాది ఫైనల్‌కు ఎంట్రీ ఇచ్చింది. రెండు జట్లు బలంగా ఉండడంతో ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఇరు జట్లలోనూ ఐదుగురు ఆటగాళ్లు కచ్చితంగా మెరుపులు మెరిపించే అవకాశం ఉంది.. వారి ఆటపై ఓ లుక్కేయండి.
శుభ్‌మాన్ గిల్
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు సెంచరీలు బాది.. ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. గిల్ ఇప్పటివరకు 851 పరుగులు చేశాడు. చెన్నైతో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో మరో భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది.
రుతురాజ్ గైక్వాడ్
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఎలా ఆడతాడోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. గుజరాత్‌పై గైక్వాడ్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. ఈసారి కూడా గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడితే చెన్నైకు తిరుగుండదు.
డెవాన్ కాన్వే
చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓపెనర్ డెవాన్ కాన్వే మెరుపు ఆరంభాలు ఇస్తూ.. చెన్నైకు మంచి పునాది వేస్తున్నాడు. ఈ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌లలో 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 92 నాటౌట్. గుజరాత్‌పై సత్తాచాటే అవకాశం ఉంది.
మహ్మద్ షమీ
గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఈ సీజన్‌లో బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. షమీ ఇప్పటివరకు 28 వికెట్లు తీశాడు. కొత్త బంతితో షమీ బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. పవర్ ప్లేలో షమీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
మతీషా పతిరణ
చెన్నై స్టార్ ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరణ అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ప్రభావంతంగా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్ల జోరుకు కళ్లెం వేస్తున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లోనూ గుజరాత్ బ్యాట్స్‌మెన్‌కు బ్రేక్ వేసే ఛాన్స్ ఉంది.
Also Read: GT vs MI Highlights: నెట్ బౌలర్ టు మ్యాచ్ విన్నర్.. మోహిత్ శర్మ వాట్ ఏ బౌలింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి