DC vs KKR Dream11 Prediction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో జట్లు పోటపోటిగా తలపడనున్నాయి. ఈ రోజు మొహ్లిలోని బింద్రా స్టేడియం వేదికగా బెంగళూరు, పంజాబ్ టీమ్‌ పోటీకి దిగగా..రాత్రి 7:30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఢిల్లీ ఇప్పటికీ ఐదు మ్యాచ్‌ ఆడగా.. ఐదుకు ఐదు మ్యాచ్‌లు ఓటమి పాలయ్యింది. ఇక కోల్‌కతా విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌ గెలిచి..మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోలిస్తే, కోల్‌కతా నైట్ రైడర్స్‌ ముందంజలో ఉంది. ఇప్పటికీ కోల్‌కతా ఐపీఎల్‌లో 227 మ్యాచ్‌ ఆడింది. అందులో 114పైగా మ్యాచ్‌లు విజయం సాధించింది. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఏం టీమ్‌ గెలుస్తుందో?,  డ్రీమ్ 11 టీమ్‌ ఎంటో? మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ రిపోర్ట్:
అరుణ్ జైట్లీ స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది.  రెండవ ఇన్నింగ్స్‌లో బౌలర్లకు సహాయం మారుతుంది. కాబట్టి టాస్‌ గెలిచిన తర్వాత బ్యాటింగ్‌ చేసే టీమ్‌ ఎక్కువ స్కోర్‌ చేసే అవకాశాలున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ ఏడాది చాలా మ్యాచుల్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించగా.. ఫాస్ట్ బౌలర్లతో పాటు రషీద్ ఖాన్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు కూడా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు తీశారు.


Also Read: RCB VS PBKS Dream11 Prediction: ఈ రోజు జరిగే పోరులో విజయం సాధించే జట్టు ఇదేనా?, పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 ప్రిడిక్షన్‌ వివరాలు!


DC vs KKR హెడ్ టు హెడ్ రికార్డ్స్:
రెండు జట్లూ ఇప్పటి వరకు మొత్తం 31 IPL మ్యాచ్‌లు ఆడగా.. అందులో KKR 16 మ్యాచ్‌లు, DC 14 మ్యాచ్‌లు గెలిచాయి.


ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11:
డేవిడ్ వార్నర్ (c), మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకిమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (WK), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్నియా, ముస్తాఫిజుర్ రెహమాన్


కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11:
నారాయణ్ జగదీసన్, రహ్మానుల్లాహ్ గుర్బాజ్ (WK), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి


డ్రీమ్ 11 ప్రిడిక్షన్:
డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్, గుర్బాజ్‌, వెంకటేష్ అయ్యర్,  మిచెల్ మార్ష్, రస్సెల్, నరైన్, అక్షర్ పటేల్, ఎన్రిక్ నార్నియా, ముస్తాఫిజుర్ రెహమాన్, లాకీ ఫెర్గూసన్


Also Read: RCB VS PBKS Dream11 Prediction: ఈ రోజు జరిగే పోరులో విజయం సాధించే జట్టు ఇదేనా?, పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 ప్రిడిక్షన్‌ వివరాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook