Kohli Runs in IPL: అన్ని రికార్డులు బద్దలు కొడుతూ.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ.. రికార్డులు రారాజుగా పేరు తెచ్చుకున్న కింగ్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో ఇప్పటికే అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా ఉన్న కోహ్లీ.. తాజాగా మరో రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచాడు. శనివారం ఢిల్లీ క్యాపిటిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఐదో బంతిని కోహ్లీ బౌండరీకి బాది 12 పరుగులకు చేరుగానే.. ఐపీఎల్‌లో 7 వేల రన్స్ పూర్తయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోహ్లీ 233 మ్యాచ్‌లు, 225 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ 36.87 సగటుతో 7,043 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 113. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలవగా.. రెండోస్థానంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఉన్నాడు. 212 ఇన్నింగ్స్‌ల్లో 6536 పరుగులు చేశాడు. ఆ తరువాతి స్థానాల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (6,189 పరుగులు), టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (6,063 పరుగులు), మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా (5,528 పరుగులు) ఉన్నారు.


ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. 10 మ్యాచ్‌ల్లో 46.55 సగటుతో 419 పరుగులు చేశాడు. 135.16 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. అత్యుత్తమ స్కోరు 82 పరుగులు కాగా.. ఈ సీజన్‌లో ఆరు అర్ధ సెంచరీలు బాదేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో నాలుగోస్థానంలో ఉన్నాడు. 


ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన వీరులు..


==> విరాట్ కోహ్లీ: 7,043 పరుగులు
==> శిఖన్ ధావన్: 7,043 పరుగులు
==> డేవిడ్ వార్నర్: 7,043 పరుగులు
==> రోహిత్ శర్మ: 7,043 పరుగులు
==> సురేష్ రైనా: 7,043 పరుగులు


ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కోహ్లీ (55), మహిపాల్ లోమ్‌రోర్ (54), డుప్లెసిస్ (45) రాణించారు. అనంతరం ఢిల్లీ కేవలం 3 వికెట్లు కోల్పోయి.. మరో 20 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. ఫిలిప్ సాల్ట్ (87, 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో ఢిల్లీ సునాయసంగా గెలుపొందింది.


Also Read: Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు వీరమరణం


Also Read: Assembly Election 2023: ఎన్నికల ఎఫెక్ట్.. ఆ మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook