Assembly Election 2023: ఎన్నికల ఎఫెక్ట్.. ఆ మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్

Liquor Sale Prohibited In Karnataka: కర్టాటన సార్వత్రిక ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పోలింగ్ తేదీ కంటే ముందుగానే మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. కౌంటింగ్ రోజు కూడా వైన్ షాపులు మూసివేయనున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : May 4, 2023, 04:14 PM IST
Assembly Election 2023: ఎన్నికల ఎఫెక్ట్.. ఆ మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్

Liquor Sale Prohibited In Karnataka: కర్టాటక ఎన్నికల పోలింగ్‌కు సమయం ముంచుకుస్తోంది. ఈ నెల 10 పోలింగ్ జరగనుండగా.. 13న ఫలితాలు వెలువడున్నాయి. పోలింగ్‌కు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మూడు రోజులపాటు కర్ణాటకలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకోకుండా మద్యం విక్రయాలను నిషేధిస్తూ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. తమకే ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు మూడు రౌండ్ల ప్రచారాన్ని కంప్లీట్ చేశారు. 

ఈ నెల 10న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరుగుతుందని.. ముందుజాగ్రత్త చర్యగా మే 8వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మే 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కౌంటింగ్ రోజున మే 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మే 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు లిక్కర్ అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. 

అదేవిధంగా సరిహద్దు రాష్ట్రాలైన కేరళ, ఆంధ్రప్రదేశ్‌, గోవా, తమిళనాడులో డ్రై డే కోసం ఇప్పటికే నోటిఫై చేశారు. అన్ని బార్లు, రెస్టారెంట్లు, రిటైల్ అవుట్‌లెట్‌లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శాంతి భద్రతలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మద్యం విక్రయాలు, రవాణాపై ఆంక్షలు విధించారు. అన్ని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, పబ్‌లు, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో మద్యం విక్రయాలను నిషేధించాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీబీఎంపీ కంట్రోల్ రూమ్ కూడా అప్రమత్తమైంది. సోషల్ మీడియాపై డేగ కన్ను వేసిన జిల్లా ఎన్నికల అధికారుల బృందం.. వివాదాస్పద, దూషణల పోస్టర్లను పోస్ట్ చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది.

ఈసారి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్, ట్రోల్ పేజీల అడ్మిన్‌లపై కన్నేశారు. డిజిటల్ ప్రచారం, పార్టీ అభ్యర్థుల పరువుకు భంగం కలిగించే విధంగా.. మతాన్ని రెచ్చగొట్టడం, అల్లర్లకు అనుమతి లేకుండా పోస్టులు పెడితే వెంటనే కఠినచర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటివరకు 30కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులను అధికారులు ఆర్‌ఓల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. ఎన్నికలకు సంబంధించి రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: Delhi BRS Party Office: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే..!  

Also Read: SRH vs KKR Dream 11 Team Tips: సొంతగడ్డపై కేకేఆర్‌తో హైదరాబాద్ పోరు.. డ్రీమ్ 11 టిప్స్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరంటే..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News