Most Expensive Players In IPL 2023: ఐపీఎల్ వేలంలో కోట్ల రూపాయల ధర పలికిన ఆటగాళ్లు.. పర్ఫామెన్స్‌లో మాత్రం అదే స్థాయిలో రాణించలేకపోతున్నారు. చాలా మంది ఆటగాళ్ల విషయంలో ఇదే జరిగింది. గతేడాది జరిగిన మినీ వేలంలో భారీ ధర పలికిన స్టార్ ప్లేయర్లు ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్లో తేలిపోయారు. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ ఇప్పటివరకు ఐపీఎల్‌ చరిత్రలో అమ్ముడుపోయిన అత్యంత ఖరీదైన ఆటగాడు. పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18.50 కోట్ల భారీ ధర చెల్లించి ఈ ఆల్ రౌండర్‌ను జట్టులోకి తీసుకుంది. కానీ తొలి మ్యాచ్‌లోనే సామ్ కరణ్ పెద్దగా ఆకట్టుకోలేపోయాడు. బ్యాటింగ్‌లో 26 పరుగులు చేయగా.. బౌలింగ్‌లో ఒక వికెట్ మాత్రమే తీశాడు. బౌలింగ్‌లో ఎకానమీ 12.70గా ఉంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హ్యారీ బ్రూక్ 


సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్ల ధర చెల్లించి ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ హ్యారీ బ్రూక్‌ను జట్టులో చేర్చుకుంది. అయితే మొదటి మ్యాచ్‌లో బ్రూక్ పూర్తిగా విఫలమయ్యాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవాల్సిన సమయంలో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 21 బంతుల్లో ఎదుర్కొని కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 


బెన్ స్టోక్స్


ఇంగ్లండ్ మరో స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్ల భారీ ధర చెల్లించి వేలంలో దక్కించుకుంది. అయితే స్టోక్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. గుజరాత్‌ జరిగిన మ్యాచ్‌లో  6 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేశాడు. నేడు లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో 8 బంతులు ఎదుర్కొని 8 పరుగులే చేశాడు. 


కెమెరూన్ గ్రీన్ 


ఐదుసార్లు ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్ 2022లో జరిగిన మినీ వేలంలో స్టార్ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రూ.17.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఆర్‌సీబీతో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ఫెయిల్ అయ్యాడు. 4 బంతుల్లో కేవలం 5 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 15 ఎకానమీతో 2 ఓవర్లలో 30 పరుగులు చేశాడు. ఒక వికెట్ తీసినా.. పెద్దగా ప్రయోజనం లేదు. టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్‌లు ఉండడంతో ఈ స్టార్ ప్లేయర్లు పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. 


Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ పేరిట చెత్త రికార్డు.. కెప్టెన్‌గా దారుణమైన స్ట్రైక్ రేట్


Also Read: IPL Points Table: టాప్‌లేపిన రాజస్థాన్.. హైదరాబాద్ పరిస్థితి దారుణం.. మిగిలిన జట్లు ఇలా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి