Faf du Plessis Hits Biggest Six of IPL 2023: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ బ్యాట్ తో విధ్వంసం సృష్టించి పరుగుల వరద పారించారు. ఈ ఐపిఎల్ 2023 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హోమ్ గ్రౌండ్లో ఆడుతున్న రెండో మ్యాచ్ ఇది. తొలుత టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కేప్టేన్ కె.ఎల్. రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి 44 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు స్కోర్ కి తన వంతు కంట్రిబ్యూషన్ అందించగా.. ఆ తర్వాత కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌తో జత కట్టిన గ్లెన్ మాక్స్‌వెల్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రన్‌రేట్‌ను ఓవర్‌కు 10 పరుగులకు తగ్గకుండా ఉండేలా రెచ్చిపోయాడు.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ లక్నో సూపర్ జెయింట్స్ లెగ్-స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో అద్దిరిపోయే షాట్ కొట్టాడు. బ్యాక్‌ఫుట్ మీద పొజిషన్ తీసుకున్న డు ప్లెసిస్ కొట్టిన పవర్‌ఫుల్ సిక్సర్ షాట్‌కి బంతి ఎగిరి వెళ్లి చిన్నస్వామి స్టేడియం అవతల పడింది. ఈ ఐపిఎల్ 2023 సీజన్‌లో ఇప్పటివరకు ఎంతోమంది స్టాక్ క్రికెటర్స్ భారీ సిక్సర్స్ కొట్టినప్పటికీ.. వాటి అన్నింటికంటే కూడా ఇదే అతిపెద్ద సిక్సర్ కావడం గమనార్హం. ఫాఫ్ డు ప్లెసిస్ కొట్టిన షాట్‌కి బంతి 115 మీటర్ల దూరంలో పడింది. డూ ప్లెసిస్ కొట్టిన బారీ సిక్సర్ చూసి తోటి ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ కూడా షాక్ అయ్యాడు.



 


లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆటగాళ్లు : కేఎల్ రాహుల్(కేప్టేన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), జయదేవ్ ఉనద్కత్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాళ్లు : విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కేప్టేన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.