GT vs MI: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్‌దే ఫస్ట్ బ్యాటింగ్! తుది జట్లు ఇవే
GT vs MI IPL 2023 35th Match, Mumbai Indians have won the toss and have opted to field. అహ్మదాబాద్ వేదికగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.
GT vs MI IPL 2023 35th Match Live Score Updates: అహ్మదాబాద్ వేదికగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచినా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నామని రోహిత్ చెప్పాడు. మరోవైపు తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదని గుజరాత్ సారథి హార్దిక్ పాండ్యా చెప్పాడు.
16వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో గెలిచింది. గత మ్యాచులో లక్నోపై 135 తక్కువ స్కోరే చేసినా.. అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్ గెలిచింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిలకడగా ఆడుతున్నారు. సాయి సుదర్శన్ కూడా అదరగొడుతున్నాడు. అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా దూకుడుగా ఆడాల్సిన ఉంది. మొహ్మద్ షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మలు బౌలింగ్‌లో దుమ్మురేపుతున్నారు. ఈ మ్యాచ్ సొంత మైదానంలో జరుగుతుండటం గుజరాత్‌కు కలిసొచ్చే అంశం.
2023 సీజన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ముంబై ఇండియన్స్.. తర్వాత హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఆపై పంజాబ్ కింగ్స్‌తో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఓడిన ముంబై.. నేడు గెలవాలని చూస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ నిలకడగా ఆడలేకపోతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. అయితే ముంబైకి బౌలింగ్ మైనస్‌గా మారింది. స్టార్ పేసర్లు గాయాలతో దూరమవడంతో విజయాలపై ప్రభావం పడుతోంది.
తుది జట్లు (GT vs MI Playing 11):
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (కీపర్), శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమి, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, అర్జున్ టెందూల్కర్, రిలే మెరెడిత్, పీయూష్ చావ్లా, జాసన్ బెరెన్‌డార్ఫ్.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌లు:
ముంబై: రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, షామ్స్ ములానీ, విష్ణు వినోద్, సందీప్ వారియర్.
గుజరాత్: లిటిల్, డాసున్ శనక, శివమ్ మావి, సాయి కిషోర్, శ్రీకర్ భరత్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.