Best Mileage Scooters 2023: పెట్రోల్ తక్కువ తాగి.. మైలేజ్ ఎక్కువగా ఇచ్చే 5 స్కూటర్లు ఇవే! దేశాన్ని కూడా చుట్టేయొచ్చు

2023 Best Mileage Scooters: Top 5 best mileage scooters in India and Hyderabad. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్లు, బైక్‌లను కొనేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 25, 2023, 06:05 PM IST
Best Mileage Scooters 2023: పెట్రోల్ తక్కువ తాగి.. మైలేజ్ ఎక్కువగా ఇచ్చే 5 స్కూటర్లు ఇవే! దేశాన్ని కూడా చుట్టేయొచ్చు

Top 5 best mileage scooters in India and Hyderabad: భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం లాంటి పలు కారణంగా లీటరు పెట్రోల్ ధరపై ఏకంగా రూ. 30-35 పెరిగి.. రూ. 110కి చేరింది. దేశంలో ఇంధన ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఖరీదైనదిగా మారాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై పెను భారం పడుతోంది. దాంతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్లు, బైక్‌లను కొనేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే 5 చౌక స్కూటర్ల (2023 Best Mileage Scooters) జాబితాను ఓసారి చూద్దాం. 

YAMAHA FASCINO HYBRID 125:
యమహా ఫాసినో హైబ్రిడ్ 125 మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌తో పాటు 125cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. దాంతో ఇది సుమారుగా లీటర్ పెట్రోలుపై 68 కిలోమీటర్ల మైలేజీని అందించగలదు. దీని పవర్‌ట్రెయిన్ 8.2PS/10.3Nm అవుట్‌పుట్ ఇస్తుంది. ఈ స్కూటర్ ధర సుమారు రూ. 76,600-87,830 (ఎక్స్-షోరూమ్).

YAMAHA RAYZR 125: 
యమహా రేజర్ 125 స్పోర్టియర్ స్కూటర్. ఇది 125cc ఇంజన్‌తో నడుస్తుంది. అంతేకాదు మైల్డ్-హైబ్రిడ్ సెటప్ ఇవ్వబడింది. అందువల్ల ఇది దాదాపు 68 kmpl మైలేజీని ఇస్తుంది. దీని ధర సుమారు రూ. 80,730-90,130 (ఎక్స్-షోరూమ్). ఇది ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

SUZUKI ACCESS 125: 
సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ 124సీసీ, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ స్కూటర్  64 kmpl మైలేజీని ఇవ్వగలదు. ఈ స్కూటర్ ధర సుమారు రూ. 77,600-87,200 (ఎక్స్-షోరూమ్). దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5-లీటర్లు.

TVS JUPITER:
టీవీఎస్ జూపిటర్ 110సీసీ ఇంజన్‌తో నడుస్తుంది. ఇందులో ఇంటెలిగోతో ఐడిల్ స్టార్ట్ / స్టాప్ ఫంక్షన్ ఇవ్వబడింది. ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 60 కిమీ మైలేజీని ఇస్తుంది. దీని ధర 70-85 వేల రూపాయలు (ఎక్స్-షోరూమ్).

HONDA ACTIVA 6G:
హోండా యాక్టివా 6G ధర రూ. 76,587 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది 109.51cc, సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 55 kmpl వరకు మైలేజీని అందిస్తుంది.

Also Read: Samsung Galaxy S23 Plus Price: శాంసంగ్ నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్.. స్టైలిష్ డిజైన్, బలమైన బ్యాటరీ! కొనకుండా ఉండలేరు  

Also Read: Chandra Grahan 2023: చంద్ర గ్రహణం రోజున ఈ పరిహారం చేస్తే.. ఉద్యోగ, వ్యాపారాలలో గొప్ప విజయం మీ సొంతం!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News