GT vs RR Updates: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఫామ్‌లో ఉన్న ప్లేయర్ ఔట్
Gujarat Titans vs Rajasthan Royals Playing 11: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరగబోతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్‌కు మొగ్గు చూపాడు. రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా..
Gujarat Titans vs Rajasthan Royals Playing 11: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ ఢీకొనబోతుంది. రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీద ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. గుజరాత్ మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా బిగ్‌ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. జేసన్ హోల్డర్ స్థానంలో ట్రెంట్ బౌల్ట్ తిరిగి రాజస్థాన్ జట్టులోకి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్ విజయ్ శంకర్ స్థానంలో అభినవ్ మనోహర్ తుది జట్టులో స్థానం సంపాదించాడు.
అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు సహకరించే అవకాశం ఉండడంతో పరుగుల వరద పారే అవకాశం ఉంది. రెండు జట్లలోనూ బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండడంతో సిక్సర్ల వర్షం కురవనుంది. గత ఐదు టీ20 మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్ స్కోరు 181 రన్స్‌గా ఉండడంతో.. ఈ మ్యాచ్ కూడా హైస్కోరింగ్ గేమ్‌గా జరగనుంది. రాజస్థాన్ తరుఫున దేవదత్ పడిక్కల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. గుజరాత్ తరుపున లిటిల్ జోష్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బౌలింగ్‌కు దిగే ఛాన్స్ ఉంది.
Also Read: MI vs KKR Playing 11: టాస్ గెలిచిన ముంబై.. రోహిత్ శర్మ దూరం.. అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ
తుది జట్లు ఇలా..
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్, కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.
Also Read: IPL Records: ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త ఓవర్లు ఇవే.. ఆ ముగ్గురు బౌలర్లు ఎవరంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి