ఐపీఎల్ 2023లో ఇవాళ కీలక జట్ల మ్యాచ్ చిన్నస్వామి స్డేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌కు వాతావరణం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 లో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. తొలి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్యన రెండవ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యన ఉన్నాయి. ఆర్సీబీ వర్సెస్ ఎంఐ అంటే విరాట్ వర్సెస్ రోహిత్ సేనల మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్డేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ విషయంలో వాతావరణ శాఖ నుంచి కీలకమైన అప్‌డేట్ వెలువడింది.


5 సార్లు ఐపీఎల్ విజేతగా ఉన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈ మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు చిన్నస్వామి స్డేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ సందర్బంగా వాతావరణం సాధారణంగానే ఉండనుంది. వాతావరణ శాఖ ప్రకారం 20-33 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండవచ్చు. వర్షం పడే అవకాశాల్లేవు. అంటే విరాట్ వర్సెస్ రోహిత్ సేనల పోరు చూసే అవకాశం ప్రేక్షకులకు కచ్చితంగా లభిస్తోంది. 


ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇప్పటి వరకూ 30 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆర్సీబీ 13 సార్లు, ముంబై 17 సార్లు గెలిచాయి. గత 5 పోటీలు చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన అంతగా లేదు. గత 5 మ్యాచ్‌లలో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించగలిగింది. బెంగళూరు పిచ్ బ్యాటర్లకు అనుకూలం కావడం ఈ పిచ్‌పై భారీ స్కోర్లు చూడవచ్చు


ఐపీఎల్ 2023 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్


ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మొహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, వానిందు హసరంగ, దినేష్ కార్తీక్, షాహ్‌బాజ్ అహ్మద్, రజత్ పాటీదార్, అనూజ్ రావత్, ఆకాష్ దీప్, జోష్ హేజిల్‌వుడ్, మహిపాల్ లోమ్రోర్, ఫిన్ ఎలన్,  సురేష్ ప్రభుదేశాయ్, కర్ణ శర్మ, సిద్ధార్ద్ కాల్, డేవిడ్ విల్లీ, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, మనోజ్ భాండగే, రాజన్ కుమార్, అవినాష్ సింహ్,సోను యాదవ్, మైకేల్ బ్రేస్‌వెల్


ఐపీఎల్ 2023 ముంబై ఇండియన్స్ టీమ్


రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బూమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, డ్వాల్డ్ బ్రేవిస్, తిలక్ వర్మ, జోఫ్రా ఆర్చర్, టీమ్ డేవిడ్, మొహమ్మద్ అర్షద్ ఖాన్, రమణ్ దీప్ సింహ్, రుతిక్ షౌకీన్, అర్జున్ టెండూల్కర్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కార్తికేయ, జేసన్ బెహెరెన్డార్ఫ్, ఆకాష్ మధవాల్, క్యామెరూన్ గ్రీన్, రిచర్డ్ సన్, పీయూష్ చావ్లా, డ్యూవాన్ జాన్సన్, విష్ణు వినోద్, శామ్స్ ములానీ, నేహల్ వడేరా, రాఘవ్ గోయల్


Also read: IPL 2023: సీఎస్కే ఓటమికి కారణం ఆ ఓవర్, ఆ బౌలర్ ఖరీదు 14 కోట్లు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook