KKR vs SRH: ఐపీఎఎల్ 2023 కేకేఆర్ వెర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పరాజయం పాలైంది. హైదరాబాద్ జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికలో పరుగుల వరద సాగింది. సిక్సర్లు, ఫోర్లతో స్డేడియం దద్దలిల్లింది. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో హ్యారీ బ్రూక్ తనపై విమర్శలకు చెక్ పెట్టాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సూపర్ సెంచరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ 2023లో రెండవ విజయం లభించింది. కేకేఆర్‌పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హ్యారీ బ్రూక్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సెంచరీ చేసి తనపై ఇటీవలి కాలంలో వచ్చిన విమర్శలు చెక్ పెట్టాడు. ఈ సీజన్‌లో తొలి సెంచరీ సాధించాడు. హ్యారీ బ్రూక్ 3వ ఓవర్‌లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో తానేంటో చూపించాడు. 13.25 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసుకున్న బ్రూక్ ఆ జట్టుకు న్యాయం చేశాడు. మొదటి 3 మ్యాచ్‌లలో కేవలం 29 పరుగులు చేసిన బ్రూక్..నాలుగవ మ్యాచ్‌లో 55 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేయడం విశేషం. ఇందులో 12 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆ తరువాత కెప్టెన్ మార్క్‌రమ్ తోడుగా నిలిచాడు. 26 బంతుల్లో 50 పరుగుల చేసి భారీ స్కోర్‌కు కారణమయ్యాడు. అభిషేక్ శర్మ సైతం 17 బంతుల్లో 32 పరుగులు చేశాడు.


Also read: IPL 2023: లేటు వయసులో గర్జిస్తున్న ఆటగాళ్లు.. ఈ ముగ్గురు ప్లేయర్ల బౌలింగ్ చూశారా..!


229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఆరంభంలో తడబడింది. తొలి ఓవర్లోనే గుర్బాజ్ అవుట్ కాగా ఆ తరువాత వరుస బంతుల్లో జాన్సన్..వెంకటేశ్ అయ్యర్, సునీల్ నరైన్‌లను వెనక్కి పంపాడు. గత మ్యాచ్ హీరో రింకూ సింగ్, నితీష్ రాణా చెలరేగి ఆడటంతో ఓ దశలో కేకేఆర్ కు ఆశలు చిగురించాయి. అయితే వరుసగా వికెట్లు పడటంతో రన్‌రేట్ తగ్గిపోయింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల వద్ద ఆగిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వరుసగా రెండవ విజయం లభించింది.


Also read: IPL Records: ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook