Bracewell Joins Team in Place of Will Jacks in RCB Team IPL 2023: ఐపీఎల్ 2023 ప్రారంభానికి మరి కొద్దిరోజులే మిగిలింది. వివిధ జట్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 తొలి మ్యాచ్ మార్చ్ 31 న ఉంది. ఈలోగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలకమైన మార్పు చేసింది. ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌ను ఆర్సీబీ జట్టులో చేర్చుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్ కోహ్లీ జట్టులో కీలక మార్పు


క్రిక్ బజ్ అందిస్తున్న వివరాల ప్రకారం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో విల్ జాక్స్‌కు రీప్లేస్‌మెంట్‌గా న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ జట్టులో చేరాడు. వాస్తవానికి డిసెంబర్‌లో జరిగిన వేలంగా బ్రేస్‌వెల్‌ను ఏ జట్టూ తీసుకోలేదు. బ్రేస్‌వెల్ జనవరిలో ఇండియా పర్యటనలో ఊహించని ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. అదే సమయంలో బౌలర్‌గా కూడా బ్రేస్‌వెల్ తనదైన ముద్ర వేస్తున్నాడు.


గాయం కారణంగా దూరమైన విల్ జాక్స్


ఇంగ్లండ్ జట్టుకు చెందిన విస్పోట ఆటగాడు విల్ జాక్స్‌కు ఇటీవల గాయమైంది. గాయం కారణంగా ఐపీఎల్ 202కు దూరమయ్యాడు. జాక్స్ బంగ్లాదేశ్ పర్యటనలో గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. సిరీస్ రెండవ వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా విల్ జాక్స్ కుడి కుడి భుజానికి గాయమైంది. ఈ వారంలో తీసిన స్కానింగ్, వైద్య నిపుణుల చికిత్స తరువాత ఐపీఎల్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీ20 ఫార్మట్‌లో విల్ జాక్స్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇందులో 109 మ్యాచ్‌లు ఆడి 29.80 సరాసరిన 2802 పరుగులు చేశాడు.


ఐపీఎల్ 2023లో ఆర్సీబీ జట్టు ఇదే


విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌‌వెల్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మొహమ్మద్ సిరాజ్, ఫాఫ్ డుప్లెసిస్, దినేష్ కార్తీక్, అనూజ్ రావత్, షాహబాద్ అహ్మద్, డేవిడ్ విలీ, మహిపాల్ లోమోరే, ఫిన్ ఎలన్, సిద్ధార్ధ్ కౌల్, కర్న్ శర్మ, సుయస్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, ఆకాశ్‌దీప్, మైకేల్ బ్రేస్‌వెల్, రీస్ టాప్లే, రంజన్ కుమార్, అవినాష్ సింహ్, హిమాంశు శర్మ, మనోజ్ భండారే, సోను యాదవ్


Also Read: Ravindra Jadeja Stunning Catch: రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్.. యూవీని మైమరిపించిన జడేజా


Also Read: Taraka Ratna Wife Emotional: నువ్ రియల్ హీరో ఓబు.. ఆ గుండె అన్నీ భరించింది.. తారకరత్న వైఫ్ అమోశానల్ పోస్ట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook