KKR vs GT: కోల్‌కతాదే బ్యాటింగ్.. డాషింగ్ ఓపెనర్ లేకుండానే బరిలోకి! తుది జట్లు ఇవే
KKR vs GT, Gujarat Titans have won the toss and have opted to field. ఐపీఎల్ 2023లో భాగంగా వీకెండ్‌లో జరిగే డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లకు సమయం ఆసన్నమైంది.
KKR vs GT IPL 2023 Live Score Updates: ఐపీఎల్ 2023లో భాగంగా వీకెండ్‌లో జరిగే డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లకు సమయం ఆసన్నమైంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. మరికాసేపట్లో ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో కోల్‌కతా ముందుగా బరిలోకి దిగనుంది. డాషింగ్ ఓపెనర్ జేసన్ రాయ్ లేకుండానే కోల్‌కతా బరిలోకి దిగుతోంది. అతడికి బ్యాక్ ఇంజురీ అని కెప్టెన్ నితీష్ రాణా తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రం రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా ఓపెనర్ జాసన్ రాయ్ దూరం కావడంతో.. అతడి స్థానంలో రహ్మానుల్లా గుర్బాజ్ తుది జట్టులోకి వచ్చాడు. ఉమేష్ యాదవ్ స్థానంలో హర్షిత్ రాణా ఆడుతున్నాడు.
ఇప్పటివరకు ఐపీఎల్ 2023 టోర్నీలో గుజరాత్ టైటాన్స్ ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్ 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు అందుకుంది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు వరుసగా 3, 6 స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్ గుజరాత్ కంటే కోల్‌కతాకు చాలా కీలకం. దాంతో విజయం సాదించేందుకు బరిలోకి దిగుతోంది. సొంత మైదానంలో జరుగుతుండడం కోల్‌కతాకు కలిసొచ్చే అంశం.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: నారాయణ్ జగదీశన్, రహ్మానుల్లా గుర్బాజ్ (కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా (కీపర్), అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్.
కోల్‌కతా నైట్ రైడర్స్ సబ్స్: సుయాష్ శర్మ, మన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, టిమ్ సౌతీ, కుల్వంత్ ఖేజ్రోలియా.
గుజరాత్ టైటాన్స్ సబ్స్: శుభమాన్ గిల్, శ్రీకర్ భరత్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, శివమ్ మావి, జయంత్ యాదవ్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.