Dhoni Almost Hits Deepak Chahar During CSK vs RCB: చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఇన్నింగ్స్ సమయంలో కెమెరాల కంట చిక్కిన ఓ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యాటింగ్‌కి వెళ్లేందుకు రెడీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ కేప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ.. బ్యాటింగ్‌కి ముందు బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేస్తున్నట్టుగా ఫోజులిస్తూ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాడు. అదే సమయంలో షాట్ కొట్టినట్టుగా ధోనీ తన బ్యాట్‌ని గాల్లోకి లేపాడు. యాదృచ్ఛికంగా ధోనీ బ్యాట్ ఊపిన చోటే చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్ కూర్చుని ఉన్నాడు. గాయం కారణంగా ఈ జట్టులో చోటులో చోటు కోల్పోయిన దీపక్ చాహర్.. తోటి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లతో కలిసి బౌండరీ లైన్ వద్ద ఉన్న ప్లేయర్స్ స్టాండ్స్‌లో కూర్చున్నాడు. ధోనీ షాట్ కొట్టినట్టుగా ఊపిన బ్యాట్ కాస్తా దీపక్ చాహర్ ముఖానికి తాకినంత దగ్గరి నుంచే వెళ్లింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేంద్ర సింగ్ ధోనీ ఊపిన బ్యాట్ ఎక్కడ తగులుతుందోననే భయం దీపక్ చాహర్ ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ వెంటనే దీపక్ చాహర్ అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్లి కూర్చున్నాడు. ధోనీ షాట్ కొడుతున్నట్టుగా ఫోజిస్తూ బ్యాట్ గాల్లోకి లేపడం.. అదే సమయంలో దీపక్ చాహర్ అక్కడే కూర్చుని ఉండటం, ధోనీ బ్యాట్ ఊపడం చూసి భయంతో దీపక్ చాహర్ అక్కడి నుంచి వెళ్లిపోవడం అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి.



 


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ విషయానికొస్తే.. ఇన్నింగ్స్ చివర్లో కేవలం రెండు బాల్స్ మిగిలి ఉన్నాయనగా బ్యాటింగ్ కి వచ్చిన ధోనీ.. ఒక బంతిని కొట్టి ఒక్క పరుగు తీశాడు. జట్టు స్కోర్ నిర్ణీత 20 ఓవర్లలో 226 పరుగులు చేసింది. 


ఇది కూడా చదవండి : MS Dhoni IPL Ban: ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీపై నిషేధం పడుతుంది.. వీరేంద్ర సెహ్వాగ్‌ హెచ్చరిక!


ఇటీవల కాలంలో దీపక్ చాహర్‌ని వరుస గాయాలు వేధిస్తున్నాయి. ఇదే ఐపిఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్క ఓవర్ బౌలింగ్ వేసిన అనంతరం దీపక్ చాహర్ గాయపడ్డాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతోనూ దీపక్ చాహర్ గాయం కారణంగానే మ్యాచ్ నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఇదే విషయమై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ.. దీపక్ వరుసగా గాయాలబారిన పడటంపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.


ఇది కూడా చదవండి : Vamika Kohli Dating: వామికాను డేట్‌కి తీసుకెళ్లవచ్చా.. విరాట్ కోహ్లీని కోరిన బుడ్డోడు!