Sunil Gavaskar Heap Prise on MS Dhoni Captaincy in IPL: భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ధోనీ అత్యుత్తమ కెప్టెన్ అని గవాస్కర్ పేర్కొన్నారు. ధోనీ వంటి కెప్టెన్‌ ఇప్పటివరకు ఎవరూ లేరని, భవిష్యత్తులోనూ ఉండరు అని సన్నీ చెప్పుకొచ్చారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథిగా జట్టును కఠినమైన పరిస్థితుల నుంచి గట్టెక్కిచ్చిన తీరును ఆయన కొనియాడారు. నేడు ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు (RCB vs CSK) తలపడనున్నాయి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ టోర్నీకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'గడ్డు పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు బాగా తెలుసు. అయితే అది కేవలం ఎంఎస్ ధోనీ సారథ్యంలోనే సాధ్యపడుతుంది. 200 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించడం చాలా చాలా కష్టం. ఎక్కువ మ్యాచులకు సారథ్యం వహించడం భారమే కాక.. వ్యక్తిగత ప్రదర్శననూ ప్రభావితం చేస్తుంది. ధోనీ ఇందుకు మినహాయింపు. మహీ ప్రత్యేకమైన ఆటగాడు. విభిన్నమైన కెప్టెన్ కూడా. ధోనీ వంటి కెప్టెన్‌ ఇప్పటివరకు ఎవరూ లేరు, భవిష్యత్తులోనూ రారు' అని అన్నారు.


ఏప్రిల్ 12న చెన్నైలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ (MS Dhoni) 200 మ్యాచ్‌లు పూర్తి చేశాడు. 41 ఏళ్ల భారత మాజీ కెప్టెన్ ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి ధోనీ చెన్నైలో భాగంగా ఉన్నాడు. రెండేళ్లు (2016-17) చెన్నై టోర్నీ నుంచి సస్పెండ్ చేయబడింది. 2016 సీజన్‌లో రైజింగ్ పూణే సూపర్‌ జెయింట్‌కు ధోనీ 14 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించాడు. దాంతో కెప్టెన్‌గా మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 214కి చేరింది. ధోనీ నేతృత్వంలోని సీఎస్‌కే నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 120 విజయాలు, 79 ఓటములు ధోనీ ఖాతాలో ఉన్నాయి. 


Also Read: RCB vs CSK: నేడు బెంగళూరు, చెన్నై హై ఓల్టేజ్ మ్యాచ్.. భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లీ, ధోనీ!  


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటర్ విరాట్‌ కోహ్లీని కూడా సునీల్ గవాస్కర్ కొనియాడారు. 'ప్రతి మ్యాచ్‌లోనూ విరాట్‌ కోహ్లీ బెంగళూరు జట్టుకి అద్భుత ఆరంభాలను అందిస్తున్నాడు. బెంగళూరు జట్టు ఎక్కువ పరుగులు సాధించడానికి ప్రధాన కారణం కోహ్లీనే. ఆరంభంలో కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు బెంగళూరుకు కలిసొస్తున్నాయి. కోహ్లీకి చాలా క్రెడిట్‌ దక్కుతుంది' అని గవాస్కర్ చెప్పారు. 


Also Read: RCB vs CSK Head To Head: బెంగళూరు vs చెన్నై హెడ్ టు హెడ్ రికార్డ్స్.. పిచ్‌ రిపోర్ట్‌, తుది జట్లు ఇవే!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.