Rohit Sharma likely to miss Few IPL 2023 Games: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో మెగా టోర్నీకి తెర లేవనుంది. మార్చి 31న అహ్మాదాబాద్‌ వేదికగా జరిగే లీగ్ తొలి మ్యాచులో మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరగనుంది. ఇక ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (MI vs RCB) మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచుకు ముందు ముంబై జట్టుకు (Mumbai Indians) భారీ షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ 2023తో పాటు వన్డే ప్రపంచకప్ 2023 కోసం హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్ 2023 సీజన్‌ను కాస్త  లైట్ తీసుకుకుంటున్నాడట. పనిభారం కారణంగా ఐపీఎల్ 2023లో కొన్ని మ్యాచ్‌లు మాత్రమే రోహిత్ ఆడనున్నాడని తెలుస్తోంది. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌, ప్రపంచకప్‌కు ఫిట్‌గా ఉండేందుకే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. కెప్టెన్ విన్నపాన్ని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఒకే అందని ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఇక రోహిత్ గైర్హాజరీలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టుకు కెప్టెన్‌గా (Suryakumar Yadav Captain) వ్యవహరించనున్నాడు. 


ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ భారత ఆటగాళ్ల వర్క్‌లోడ్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు  చేశాడు. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌, ప్రపంచకప్‌లో ఆడే ప్రతీ ఆటగాడి వర్క్‌లోడ్‌ను టీమ్‌ మేనేజ్‌మెంట్ పరిశీలిస్తుందని, ఫ్రాంచైజీలు తమ ఆయా ప్లేయర్స్ వర్క్‌లోడ్‌ను సమన్వయం చేసుకోవాలని చెప్పాడు. టీమిండియా ఆటగాళ్ల సన్నద్ధత బీసీసీఐ చెప్పిన ప్రకారమే ఉంటుందని హిట్ ఇచ్చాడు. అందుకే కెప్టెన్ హోదాలో ఉన్న రోహిత్.. ఇతర ఆటగాళ్లకు స్పూర్తిగా నిలిచేందుకు ఐపీఎల్ 2023లోని కొన్ని మ్యాచ్‌లు ఆడకుండా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. 


ఐపీఎల్ 2023లోని పరిస్థితులను బట్టి ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ దాదాపుగా 5-7 మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వారం రోజుల తర్వాత టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ 2023 (WTC FInal 2023) జరగనుంది. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. ఇక భారత్ గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 కూడా జరగనుంది. ఈ రెండు మెగా టోర్నీలు గెలవాలని బీసీసీఐ (BCCI) భావిస్తోంది. అందుకే భారత కీలక ఆటగాళ్లు గాయాల భారిన పడకుండా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుంటోంది.


Aslo Read: Best Mileage Car 2023: స్విఫ్ట్ కంటే తక్కువ ధర.. ఈ కారు మైలేజీ, భద్రతలో సూపర్! 27 కిలోమీటర్ల మైలేజ్


Also Read: Hyundai Sonata Facelift Launch: హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. లుక్, ఫీచర్స్ అదుర్స్! లగ్జరీ కార్లకు ధీటుగా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.