KEVIN O’BRIEN: భారీ సిక్స్ తో సొంత కారు అద్దం ఇలా బ్రేక్ చేశాడు
క్రికెట్ ( Cricket ) లో సిక్సర్లు కొట్టే ప్రతీ ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు గ్రౌండ్ అవతలికి ఒక్కసారి అయినా బంతిని పంపించి ఉంటారు.
క్రికెట్ ( Cricket ) లో సిక్సర్లు కొట్టే ప్రతీ ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు గ్రౌండ్ అవతలికి ఒక్కసారి అయినా బంతిని పంపించి ఉంటారు. అలాగే పార్కింగ్ లో ఉన్న కారు అద్దాల్ని బ్రేక్ చేసి ఉంటారు. కానీ ఐర్లాండ్ కు చెందిన కెవిన్ ఓ బ్రియన్ ( Kevin O'Brien ) మాత్రం తన కారు అద్దాల్ని తనే బ్రే చేసుకున్నాడు. ఐర్లాండ్ లో ( Irelnad ) జరుగుతున్న డొమెస్టిక్ క్రికెట్ టీ 20లో ఓ బ్రియన్ లిన్ స్టర్ టీమ్ తరపున ఆడుతున్నాడు. ప్రత్యర్థి నార్త్ వెస్ట్ వారియర్స్ టీమ్ పై విరుచుకుపడ్డాడు. కేవలం 37 బాల్స్ లోనే 82 పరుగులు చేశాడు. మొత్తం 8 సిక్సులు బాదగా... అందులో ఒక సిక్సు గ్రౌండ్ దాటి బయటికి వెళ్లింది.
ఈ బాల్ తిన్నగా వెళ్లి అతని కారు అద్దాలను తాకింది... దాంతో కారు వెనకవైపు గ్లాస్ ఇలా బ్రేక్ అయింది. అయితే ఈ విషయం కెవిన్ కు తెలియదు. తీరా మ్యాచ్ మొత్తం ముగిసిన తరువాత ఇంటికి వెళ్దామని కారు దగ్గరికి వెళ్తే షాక్ అయ్యాడు. విషయం తెలుసుకుని నవ్వి...దాని రిపెయిర్ చేయించి ఇంటికి వెళ్లాడు. గతంలో ప్రాక్టిస్ సమయంలో భారీ సిక్స్ కొట్టిన కెవిన్ గ్రౌండ్ కి దగ్గర పెట్టిన తన కారు అద్దాలను బ్రేక్ చేశాడు. అందుకే ఈసారి పార్కింగ్ లో పెట్టాడట. కానీ ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అయింది. కానీ కారు అద్దాల కోసం సిక్సులు కొట్టడం ఆపను అని చెబుతున్నాడు.