Sourav Ganguly Tweet: బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా.. రాజకీయాల్లోకి దాదా! చేరేది ఆ పార్టీలోనే..
Sourav Ganguly resigned as BCCI President. టీమిండియా మాజీ క్రికెటర్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం ట్విటర్‌లో చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది.
Is Sourav Ganguly resigned as BCCI Chief, Dada Cryptic Tweet goes viral: టీమిండియా మాజీ క్రికెటర్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం ట్విటర్‌లో చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్ రాజకీయ ఎంట్రీకి సంబంధించినదే అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా అని ఎక్కడా ప్రస్తావించని దాదా.. ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నానని మాత్రం పేర్కొన్నారు. దాంతో గంగూలీ త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
క్రీడా జీవితాన్ని ప్రారంభించి 30 ఏళ్లు గడిచాయని, ఇక మరో కొత్త మార్గంలో నడవాలనుకుంటుంన్నట్లు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశారు. '1992లో నా క్రీడా జీవితం మొదలైంది. 2022 నాటికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. క్రికెట్ నాకు ఎన్నో ఇచ్చింది. ముఖ్యంగా అభిమానుల ప్రేమను పొందగలిగాను. నా ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదలు. అందరి సహకారం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకోగలిగాను. ఇక ప్రజలకు సహాయపడేలా ఏదైనా ప్రారంభించాలనుకుంటున్నాను. ఈ కొత్త ప్రయాణంలో కూడా మీరు నాకు ఇలాగే మద్దతు ఇస్తారని భావిస్తున్నా' అని గంగూలీ పేర్కొన్నారు.
అయితే ట్వీటులో ఎక్కడా బీసీసీఐ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొనలేదు. కానీ దాదా ట్వీట్ ఉద్దేశం మాత్రం అదే అన్నట్లుగా అర్థమవుతోంది. ఏదేమైనా ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. దాదా రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గంగూలీ రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఊహాగానాలు రావడంపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు.
మే 29న నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2022 ఫైనల్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సమయంలోనే బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో షా ప్రత్యేకంగా బేటీ అయి.. రాజకీయ ఎంట్రీ గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇదివరకు కూడా అమిత్ షాతో గంగూలీ బేటీ అయ్యారు. దాంతో దాదా బీజేపీలో చేరడం పక్కా అని తెలుస్తోంది. ప్రస్తుతం బెంగాల్‌లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వానికి ధీటుగా దాదానువు బీజేపీ దించే ఆలోచనలు చేస్తోందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ప్రస్తుత బీసీసీఐ సెక్రటరీ జై షా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Poorna Engagement: హీరోయిన్ పూర్ణ సీక్రెట్ ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలుసా?
Also Read: టాలీవుడ్ స్టార్ కమెడియన్ కూతురు సినీ ప్రవేశం.. హీరో ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook