ముంబై  : 2019-2020 సంవత్సరానికి బీసీసీఐ ప్రకటించిన 27 మంది సెంట్రల్ లిస్ట్ ధోని పేరు లేకపోవడంతో, ఇక ధోని కెరీర్ కు ముగింపు కార్డు పడినట్టేనా అనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 2018-2019 వార్షిక సంవత్సరంలో కేటగిరీ "A" లో ఉన్న ధోని ఈ సారి 27 మంది సభ్యుల్లో పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత ప్రపంచ కప్ లో న్యూ జీలాండ్ తో సెమీఫైనల్లో భారత్ ఓటమి తరవాత వన్డే క్రికెట్ కు దూరంగా ఉన్నాడు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్ 2020 లో ధోని పాల్గొనే అవకాశం 2020లో జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో  ఆటతీరు వాటి గణాంకాలపై ఆధారపడి ఉంటుందని భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఇంతకు ముందే సూచించిన విషయం తెలిసిందే.  


2019-20 సంవత్సరానికి బీసీసీఐ సెంట్రల్ కమిటీ 


గ్రేడ్ ఎ + (ఐఎన్ఆర్ 7 కోట్లు): విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా. 
గ్రేడ్ ఎ (ఐఎన్ఆర్ 5 కోట్లు): రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, చేతేశ్వర్ పూజారా, అజింక్య రహానే, శిఖర్ ధావన్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్.  
గ్రేడ్ బి (ఐఎన్ఆర్ 3 కోట్లు): వృద్దిమాన్ సాహా, ఉమేష్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్.  
గ్రేడ్ సీ (ఐఎన్ఆర్ 1 క్రోర్) కేదార్ జాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, మనీష్ పాండే , హనుమ విహారి, శార్దూల ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ లు ఉన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..