Hardik Pandya Ankle Injury: వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్​లో స్టార్ బ్యాటర్ హార్దిక్ పాండ్య ఆడేది అనుమానమేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో హార్దిక్ గాయపడ్డ సంగతి తెలిసిందే. 2024 ఐపీఎల్ నాటికి అతడు కోలుకోవడం కష్టమేనని తెలుస్తోంది. ఇది ముంబై ఇండియన్స్ కు ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ ను ఎంపిక చేసి షాకిచ్చింది ఫ్రాంఛైజీ. అయితే తాజాగా ఈ మెగాటోర్నీలో హార్దిక్ ఆడేది కష్టమేనంటూ వస్తున్న వార్తల్లో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడింది ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీ యాజమాన్యం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ లో హార్ధిక్ ఆడకపోతే ముంబైకి ఎవరికి సారథ్యం వహిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే అతడి స్థానంలో రోహిత్ కు మళ్లీ పగ్గాల అప్పగిస్తుందా లేదో వేచిచూడాలి. దీనికి ఒక వేళ రోహిత్ ఆంగీకరించకపోతే సీనియర్ల అయిన బూమ్రా, సూర్యకుమార్ యాదవ్ లలో ఎవరో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అతడి ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను దాదాపు 8 మిలియన్స్ మంది అన్ ఫాలో కొట్టేశారు. 


వన్డే ప్రపంచ కప్ 2023 సమయంలో హార్దిక్ పాండ్యా చీలమండ గాయంతో టోర్నమెంట్ నుండి దురదృష్టవశాత్తు వైదొలిగాడు. గాయం తగ్గకపోవడంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగిన సిరీస్ లకు దూరమయ్యాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ నాటికి హార్దిక్ కోలుకుంటాడని అందరూ భావించారు. అయితే ఆడటం కష్టమేనని నివేదికలు తెలుపుతున్నాయి. 


Also Read: WFI New President: రెజ్లింగ్ సమాఖ్య నయా బాస్ సంజయ్ సింగ్.. కుస్తీకి గుడ్ బై చెప్పిన సాక్షీ మాలిక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook