ప్రాన్స్‌లో జరుగుతున్న సొట్టేవిల్లే అథ్లెటిక్స్ మీట్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(20) సత్తా చాటాడు. రికార్డు స్థాయిలో 85.17 మీటర్లు జావెలిన్‌ను విసిరి స్వర్ణ పతాకాన్ని సాధించాడు. ఛాంపియన్ చోప్రా తర్వాతి స్థానంలో మోల్దోవన్ ఆండ్రియన్ (81.48 మీటర్లతో) రజత పతకాన్ని గెలుపొందగా.. లితివేనియా అథ్లెట్‌ ఈడిస్ (79.31 మీటర్లతో) కాంస్య పతకం గెలుపొందారు. మరో ఆటగాడైన ఒలింపిక్ ఛాంపియన్‌ వాల్కాట్‌ 78.26 మీటర్లు మాత్రమే జావెలిన్‌ను విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో (86.47 మీటర్లు) స్వర్ణంతో మెరిసిన జావెలిన్.. వచ్చే నెల ఇండోనేషియా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్‌లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నాడు. 2016‌లో జరిగిన వరల్డ్‌ అండర్-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌‌షిప్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 86.48 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.


జావెలిన్ త్రోయర్‌ను విసిరి సాధించిన పసిడి పతకాలు: వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్- పోలాండ్ (2016), ఏసియన్ ఛాంపియన్షిప్స్- భువనేశ్వర్(2017), సౌత్ ఏషియా గేమ్స్- గౌహతి(2016), కామన్వెల్త్ గేమ్స్‌- గోల్డ్ కోస్ట్ (2018)