తన ఓటు ఏమైందని నిలదీసిన జ్వాలా గుత్తా !
నా ఓటు ఎందుకు లేదని నిలదీసిన జ్వాలా గుత్తా
హైదరాబాద్: రెండు, మూడు వారాల క్రితం ఆన్‌లైన్‌లో పరిశీలించినప్పుడు కనిపించిన తన పేరు ఇవాళ ఓటు వేద్దామంటే కనిపించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల. రెండు, మూడు వారాల క్రితం ఆన్‌లైన్‌లో పొందుపర్చిన ఓటర్ల జాబితాను పరిశీలించినప్పుడు తన పేరు, తన తల్లి పేరు కనిపించాయి కానీ తన తండ్రి, సోదరి పేర్లు కనిపించలేదంటున్న జ్వాలా గుత్తా... ఇవాళ ఓటు వేసేందుకని పోలింగ్ బూత్‌కి వెళ్లి చూస్తే, తన పేరు కూడా గల్లంతయ్యిందని వాపోయారు. గత 12 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నప్పటికీ తన పేరు ఎందుకు గల్లంతయ్యిందో అర్థం కావడం లేదని ఆమె అయోమయాన్ని వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జ్వాలా గుత్తా.. ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాలో లేనప్పుడు, ఓటింగ్ పారదర్శకంగా జరుగుతుందని ఎలా భావించాల్సి ఉంటుందని అక్కడి అధికారులను నిలదీశారు. జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.