Kidambi Srikanth beat Lakshya Sen to Enters BWF World Championships: భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ (Kidambi Srikanth) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (BWF World Championships) 2021 పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. దాంతో పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌ చేరిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా స్పెయిన్‌ వేదికగా శనివారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో 12వ సీడ్‌ శ్రీకాంత్‌ 17-21, 21-14, 21-17తో భారత్‌కే చెందిన లక్ష్యసేన్‌ (Lakshya Sen)పై అద్భుత విజయం సాధించాడు. ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ 69 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఓడిన లక్ష్యసేన్‌.. కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెమీఫైనల్లో ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. కిదాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ (Kidambi Srikanth vs  Lakshya Sen) నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. ముందుగా 4-4 వద్ద స్కోర్లు సమం అయింది. ఆధిక్యం మారుతూ 7-7 వద్ద మరోసారి స్కోర్లు సమమయ్యాయి. విరామానికి లక్ష్యసేన్‌ 11-8తో ముందుకు దూసుకెళ్లాడు. ఆపై శ్రీకాంత్‌ (Kidambi Srikanth) పుంజుకుని 17-16తో ఆధిక్యం సంపాదించాడు. ఐతే లక్ష్యసేన్‌ వరుసగా అయిదు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లోనూ జోరు కొనసాగించిన లక్ష్యసేన్‌.. 8-4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. తన అనుభవాన్ని ప్రదర్శించిన శ్రీకాంత్‌.. వరుసగా అయిదు పాయింట్లు సాధించి విరామ సమయానికి 11-9తో నిలిచాడు. అనంతరం 18-14తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన శ్రీకాంత్‌.. లక్ష్యసేన్‌కు మరో అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. 


Also Read: December 19 Horoscope: ఆ రాశివారు ఆదివారం స్నేహితులకు దూరంగా ఉండాలి.. దొరికితే అంతే!


ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌ కిదాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ మధ్య హోరాహోరీగా సాగింది. నువ్వానేనా అన్నట్టు ఆడడంతో 7-7 వద్ద స్కోరు సమమైంది. అయితే విరామానికి లక్ష్యసేన్‌ (Lakshya Sen) 11-8తో ఆధిక్యంలో నిలిచాడు.  విరామం తర్వాత పుంజుకున్న శ్రీకాంత్‌ (Kidambi Srikanth).. వరుస పాయింట్లు సాధించి 13-13తో స్కోరును సమం చేశాడు. ఆపై స్కోర్ 16-16తో సమం అయింది. దాంతో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో ఒత్తిడిని జయించిన శ్రీకాంత్‌ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 19-16తో ఆదిక్యంలో నిలిచాడు. ఆపై అదే దూకుడుతో 21-17తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను ముగించాడు. నేడు జరిగే ఫైనల్లో  కీన్‌ యె (Loh Kean Yew)తో శ్రీకాంత్‌ తలపడతాడు. భారత కాలమానం ప్రకారం పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ సాయంత్రం 5 గంటలకు మొదలవ్వనుంది. 


Also Read: BiggBoss Telugu 5 Grand Finale: బిగ్‌బాస్ తెలుగు 5 గ్రాండ్ ఫినాలే అతిధుల జాబితా ఇదే


సెమీఫైనల్లో లక్ష్యసేన్‌ (Lakshya Sen) ఓడిపోయినప్పటికీ.. తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ప్రకాశ్‌ పదుకొనే (1983), సాయిప్రణీత్‌ (2019) తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించిన మూడో భారతీయ క్రీడాకారుడిగా లక్ష్య సేన్‌ నిలిచాడు. ఇక ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరిన మూడో భారత ప్లేయర్‌గా కిదాంబి శ్రీకాంత్‌ రికార్డు నెలకొల్పాడు. 2015లో సైనా నెహ్వాల్‌ (Saina Nehwal),.. 2017, 2018, 2019లో పీవీ సింధు (PV Sinchu) ఫైనల్‌ చేరారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook