కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లాంటి జట్టుకి కె.ఎల్ రాహుల్ లాంటి ఆటగాడు తోడవ్వడంతో ఈ జట్టు అవలీలగా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుని ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టులో గౌతమ్ గంభీర్ 42 బంతుల్లో 55 పరుగులు చేసి స్కోరుకి మంచి పునాది వేయగా.. రిషబ్ పంత్ (28), క్రిస్ మోరిస్ (27), డేనియల్ క్రిస్టియన్ (13) కూడా బాగానే తమదైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. తద్వారా  7 వికెట్ల నష్టానికి ప్రత్యర్థి జట్టుకి 167 లక్ష్యాన్ని ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ టార్గెట్ పూర్తి చేయడానికి బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో కె ఎల్ రాహుల్ రికార్డుల మోత మోగించాడు. ఒకే ఓవర్‌లో 24 పరుగులు కొట్టిన రాహుల్... 14 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్థ సెంచరీ పూర్తిచేశాడు. తద్వారా గతంలో ఐపీఎల్‌లో యూసుఫ్ పఠాన్ నెలకొల్పిన 15 బంతుల్లో అర్థ సెంచరీ రికార్డుని తిరగరాశాడు. 


అలాగే కరుణ్ నాయర్ (33 బంతుల్లో 50), డేవిడ్ మిల్లర్ (23 బంతుల్లో 24) కూడా రాణించడంతో కింగ్స్ జట్టుకి టార్గెట్ కొట్టడం అసాధ్యమేమీ అనిపించలేదు. ఈ మ్యాచ్‌లో స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గౌతమ్ గంభీర్ అవార్డు అందుకున్నారు. అలాగే నయీ సోచ్ అవార్డును ఆశ్విన్ అందుకున్నారు.అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన క్రికెట్ హీరో కె ఎల్ రాహుల్ అందుకున్నాడు