Nitish Rana: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అంటేనే క్రికెట్‌ప్రియులకు పండుగే. ఐపీఎల్‌లో క్షణం క్షణం ఉత్కంఠగా ఉంటుంది. శనివారం జరిగిన కోల్‌కత్తా మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రత్యర్థి వికెట్‌ పడిన సమయంలో ఓ బౌలర్‌ చేసిన ప్రవర్తన సర్వత్రా విమర్శలకు దారి తీసింది. అతడి ఓవర్‌ యాక్షన్‌పై మ్యాచ్‌ నిర్వాహకులు కూడా స్పందించారు. దురుసు ప్రవర్తనకు పాల్పడిన ఆటగాడికి భారీ జరిమానా విధించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IPL 2024 SRH vs KKR: క్షణాల్లో మారిన సీన్, పాపం కావ్య పాప..సోషల్ మీడియాలో వైరల్


 


ఐపీఎల్‌లో భాగంగా శనివారం సాయంత్రం రెండో మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడ్డాయి. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ సమయంలో కేకేఆర్‌ పేసర్‌ హర్షిత్‌ రాణా ప్రవర్తన ప్రేక్షకులతోపాటు ఇతర ఆటగాళ్లకు చిర్రెత్తుకొచ్చింది. మయాంక్‌ అగర్వాల్‌ను ఔట్‌ చేసిన అనంతరం హర్షిత్‌ రాణా ఫ్లయింగ్‌ కిస్‌ ఇస్తూ వీడ్కోలు పలకడం తీవ్ర దుమారం రేపింది. అంతేకాకుండా హెన్రిచ్‌ క్లాసెన్‌తో కూడా హర్షిత్‌ దురుసు ప్రవర్తన చేశారు. ఇలాంటి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన మ్యాచ్‌ రిఫరీ మను నయ్యర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండింటికి కలిపి రిఫరీ హర్షిత్‌ రాణా మ్యాచ్‌ ఫీజులో 60 శాతం కోత విధించారు. ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ 2.5 నిబంధన ఉల్లంఘన కింద రాణాకు మ్యాచ్‌ ఫీజులో భారీగా కోత పడింది.

Also Read: Pat Cummins: అతడే కారణం, మ్యాచ్ ఓటమికి కారణాలు వివరించిన కమిన్స్


 


కేకేఆర్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లో కోల్‌కత్తా విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్‌ చేసిన కేకేఈఆర్‌ 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌  7 వికెట్లు కోల్పోయి 204 పరుగుల వద్దకు పరిమితమై మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో క్లాసెన్‌ అద్భుతంగా ఆడి సన్‌రైజర్స్‌ అభిమానులకు చక్కటి వినోదం అందించారు. 8 సిక్సర్లతో రెచ్చిపోయి 63 పరుగులు సాధించారు. చివరివరకు పోరాడిన హైదరాబాద్‌ నాలుగు పరుగులతో మ్యాచ్‌ను ఓడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి