భారత క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్, ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ (KXIP) కెప్టెన్ కెఎల్ రాహుల్ కు ఐపిఎల్ 2020 (IPL 2020) ఎంతో ప్రత్యేకం. కెఎల్ రాహుల్ పై ఐపీఎల్ అభిమానులు ఒక కన్నేసి ఉంచనున్నారు. ఎందుకంటే డిల్లీ క్యాపిటెల్స్ టీమ్ తో (DC) తలపడుతూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ తరపున ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా కెప్టెన్ గా రంగంలోకి దిగనున్నాడు కెఎల్ రాహుల్  (K L Rahul). అయితే కెఎల్ రాహుల్ తన ఫోకస్ 2000 పరుగులు పూర్తిచేయడంపై కూడా పెట్టనున్నాడు. ఈ మైలురాయిని పూర్తి చేయడానికి రాహుల్ కేవలం 23 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ|  Cricket Wonders: వీళ్ల బౌలింగ్ లో ఎవరూ సిక్సర్ కొట్టలేకపోయారు
ఐపీఎల్ లో 2000 పూర్తి చేసే 20వ భారతీయుడిగా కెఎల్ రాహుల్
కరోనావైరస్ కు ముందు కెఎల్ రాహుల్ ఫామ్ అద్భుతంగా ఉంది.ఈ సంవత్సరం ప్రారంభంలో టీమ్ ఇండియా  (Team India) న్యూజిలాండ్ టూర్ వెళ్లినప్పుడు కెఎల్ రాహుల్ తన బ్యాట్ తో మ్యాజిక్ చేసి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆ టూర్ లో రాహుల్ టీ 20 ఐ (T20I), వన్డే సిరీస్ లో మంచి విజయం సాధించాడు. ఇలాంటి సమయంలో ఐపీఎల్ 13వ (IPL 13) సీజన్ లో అదే ఫామ్ ను కొనసాగిస్తూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో (IPL) 2000 పరుగులు పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రాహుల్ 67 ఐపీఎల్ మ్యాచుల్లో 1977 పరుగులు చేశారు. 


ALSO READ|  Sachin Tendulkar: సెహ్వాగ్ కోసం సచిన్ త్యాగం


ఒక వేళ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ రెండో మ్యాచులో రాహుల్ 23 పరుగులు చేస్తే... ఐపీఎల్ లో 2000 పూర్తి చేసే 20వ భారతీయుడిగా కెఎల్ రాహుల్ రికార్డు క్రియేట్ చేయనున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్, టీమ్ ఇండియా సారథీ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్ లో అత్యధికంగా 5412 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు కొనసాగుతున్నాడు.



కెఎల్ రాహుల్ ఐపీఎల్ రికార్డులు ఇవే
ఐపీఎల్ లో తన దమ్ము చూపించినందుకు మాత్రమే కెఎల్ రాహుల్ టీమ్ ఇండియాలో (Indian Cricket)  తన స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ లీగ్ లోనే అత్యుత్తమ ప్రదర్శన చూపించిన లోకేష్ రాహుల్ టీమ్ ఇండియాలో చోటు సంపాదించుకున్నాడు. ఈ సమయంలో భారత్ క్రికెట్ టీమ్ లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ లో కెఎల్ రాహుల్  (Lokesh Rahul) కూడా ఒకరు.  మొత్తం 67 ఐపీఎల్ మ్యాచుల్లో 42 .06 యావరేజ్ తో 138.15 స్ట్రైక్ రేట్ తో 1977 పరుగుల చేశాడు రాహుల్. ఇందులో 16 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉంది.  


ALSO READ| Super Bowlers: ఐపిఎల్ లో అత్యధిక మేడిన్ ఓవర్లు వేసిన బౌలర్లు వీరే


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే     ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR