KL Rahul Flop Show: కేఎల్ రాహుల్‌కు ఫేవరెటిజం వల్లే చోటు.. టీమిండియా సెలక్షన్‌పై మాజీ క్రికెటర్ సంచలన ట్వీట్లు
Venkatesh Prasad On KL Rahul: కేఎల్ రాహుల్ చెత్త పర్ఫామెన్స్పై నెట్టింట భారీ విమర్శలు వస్తున్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కాదని.. రాహుల్‌ను ఆసీస్‌తో తొలి టెస్టుకు తీసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ చేసిన ట్వీట్లు సంచలనం రేకిత్తిస్తున్నాయి. జట్టులో ఎంపిక పర్ఫామెన్స్‌ను బట్టి జరగట్లేదని.. కేవలం ఫేవరెటిజనంతోనే జరుగుతోందని కామెంట్స్ చేశారు.
Venkatesh Prasad On KL Rahul: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో టీమిండియా అదరగొట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ను ఆడించడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కాదని రాహుల్‌ను ఎందుకు ఆడించారంటూ మాజీలు ప్రశ్నిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో 71 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 20 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
కేఎల్ రాహుల్‌ను ఎంపికపై ప్రశ్నిస్తూ భారత మేనేజ్‌మెంట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ సంచలన ట్వీట్లు చేశారు. ఫామ్‌లోలేని వారికి జట్టులో చోటు ఎలా కల్పిస్తున్నాంటూ ప్రశ్నించారు. గత పది ఇన్నింగ్స్‌ల్లో కేఎల్ రాహుల్ కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. హుల్ ఇప్పటివరకు 46 టెస్టుల్లో 34 సగటుతో మొత్తం 2624 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 22, 23, 10, 2, 20 లాస్ట్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ స్కోర్లువి. జట్టులోకి పర్ఫామెన్స్ ఆధారంగా కాకుండా.. ఫేవరిటిజంతోనే ఎంపిక చేస్తున్నారంటూ బాంబ్ పేల్చారు వెంకటేశ్ ప్రసాద్.
'రాహుల్ ప్రతిభను, సామర్థ్యాన్ని చాలా గౌరవిస్తాను. కానీ దురదృష్టవశాత్తూ అతని ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. 8 ఏళ్లు జట్టులో ఉన్న కేఎల్ రాహుల్ 46 టెస్టుల ఆడినా సగటు మాత్రం 34. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇది చాలా ఆర్డినరీ. రాహుల్‌కు ఇచ్చిన అవకాశాలు చాలా మందికి ఇవ్వలేదు. ప్రస్తుతం చాలామంది క్రికెట్ యంగ్ ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తూ.. అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ సెంచరీలు బాదుతున్నాడు. రాహుల్ కంటే ఇలాంటి ప్లేయర్లు జట్టులో ఉండేందుకు అర్హులు.' అని వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశారు.
టీమిండియాలో పరిస్థితులు చాలా అధ్వానంగా తయారయ్యాంటూ ఈ దిగ్గజ ఆటగాడు ఫైర్ అయ్యారు. రాహుల్‌ని వైస్ కెప్టెన్‌ని చేశారు కానీ.. అతని కంటే అశ్విన్‌ది గొప్ప క్రికెట్ బ్రెయిన్ అని అన్నారు. అశ్విన్‌ను వైస్ కెప్టెన్ కెప్టెన్ చేయొచ్చు కదా అన్నారు. పుజారా కూడా వైస్ కెప్టెన్‌కు అర్హుడేనన్నారు. ప్రస్తుతం దేశవాళీలో మయాంక్ అగర్వాల్ ఇటీవల రాహుల్ కంటే మెరుగ్గా ఆడుతున్నాడన్నారు. రాహుల్ ఎంపిక కేవలం ఫేవరిటిజంతోనే జరుగుతోందని.. పర్ఫార్మెన్స్‌ని బట్టి కాదని స్పష్టం చేశారు వెంకటేశ్ ప్రసాద్.
Also Read: IND vs AUS 1st Test Highlights: కోహ్లీని దాటేసిన షమీ.. సిక్సర్లతో స్టేడియంలో హోరు
Also Read: Ind Vs Aus 1st Test: తోక ముడిచిన ఆసీస్.. ఇన్నింగ్స్ తేడా టీమిండియా భారీ విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook