గిఫ్ట్ ఇవ్వాలనుకున్న చిన్నారి అభిమాని.. పక్కకు నెట్టేసిన కోహ్లీ
విరాట్ కోహ్లీకి ఫ్యాన్ అయిన ఓ చిన్నారి అభిమాని.. తన ఫేవరెట్ ఆటగాడికి బహుమతి ఇవ్వాలని భావించాడు.
విరాట్ కోహ్లీకి ఫ్యాన్ అయిన ఓ చిన్నారి అభిమాని.. తన ఫేవరెట్ ఆటగాడికి బహుమతి ఇవ్వాలని భావించాడు. తనకు ఎయిర్ పోర్టులో కోహ్లీ కనిపించినప్పుడు దగ్గరకు వెళ్లి గిఫ్ట్‌ను అందించాడు. కానీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి కారు వద్దకు వెళ్లడంలో బిజీగా ఉన్న కోహ్లీ.. ఆ అభిమానిని సున్నితంగా పక్కకు నెట్టేశాడు. కనీసం తాను ఏం తెచ్చాడో కూడా చూడలేదు. కోహ్లీ-అనుష్కల పెళ్లి ఫోటోలను ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చాడు ఆ బాలుడు. కానీ విరాట్ కనీసం తనను పట్టించుకోకపోవడంతో ఆ పిల్లాడు పక్కకు వెళ్లిపోయాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. అనేకమంది అభిమానులు కోహ్లీకి వ్యతిరేకంగా కామెంట్లు కూడా పెడుతున్నారు. సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్నవారు కనీసం అభిమానులను అర్థం చేసుకున్న పాపాన కూడా పోలేదని పలువురు అంటున్నారు. అయితే బిజీగా ఉండే వ్యక్తులకు ఇలాంటి అభిమానులను పట్టించుకొనే తీరిక ఉండదని కూడా పలువురు చెప్పడం గమనార్హం. కాకపోతే.. ఎంత సెలబ్రిటీలైనా అప్పుడప్పుడు ఫ్యాన్స్ భావోద్వేగాలు కూడా అర్థం చేసుకోవాలని కొందరు అంటున్నారు.
ఆసియా కప్‌లో భాగంగా మరో రెండు రోజుల్లో బరిలోకి దిగనున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ లేకుండానే ఆడడానికి సిద్ధమవుతోంది. 'కోహ్లీ మినహా ఇతర భారత బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా ఈ పర్యటనలో ఆడటం కష్టమే' అని ఇటీవలే ఇయాన్ చాపెల్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో కోహ్లీపై విమర్శలు కూడా పెరిగాయి. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి 4 సంవత్సరాలు గడుస్తున్నా.. ఫీల్డింగ్, బౌలర్ల మార్పు లాంటి విషయాల్లో విరాట్ కోహ్లీ ఇంకా పరిణితి సాధించలేదని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విమర్శించారు.