Kohli Fans Arrested: విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు!
Kohli Fans Arrested: టీమ్ఇండియా, శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టులో ఇద్దరు కోహ్లీ అభిమానులు నిబంధనలను అతిక్రమించారు. భద్రతా సిబ్బందిని దాటుకొని మైదానంలోకి పరుగెత్తుకుంటూ వెళ్లారు. ఇప్పుడు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
Kohli Fans Arrested: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా టీమ్ఇండియా, శ్రీలంక మధ్య రెండో టెస్టు జరిగింది. ఈ మ్యాచులో రోహిత్ సేన ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ అభిమానులు సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించారు. బారికేడ్లను దాటి గ్రౌండ్ లోకి వెళ్లిన ఇద్దరు ఫ్యాన్స్ కోహ్లీతో ఫొటోలు దిగారు. వీరిద్దరిని బెంగళూరు పోలీసులు మార్చి 14న అరెస్టు చేశారు.
కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోహ్లీ అభిమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న ఈ ఇద్దరు అభిమానులలో ఒకరు కలబుర్గి చెందిన వారు కాగా.. మరొకరు బెంగళూరుకు చెందినట్లు అధికారులు వెల్లడించారు. వీరిద్దరి కోర్టు ముందు హాజరు పరిచినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
నిబంధనల ఉల్లంఘన
క్రికెటర్లకు ఏర్పాటు చేసిన భద్రతా ప్రోటోకాల్స్ ను కోహ్లీ ఫ్యాన్స్ అతిక్రమించిన కారణంగా వారిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 13 రాత్రి 10.15 గంటల సమయంలో మ్యాచు జరుగుతుండగా.. విరాట్ కోహ్లీతో సెల్ఫీలు దిగేందుకు భద్రతా సిబ్బందిని దాటుకొని ఆ ఇద్దరు నిందుతులు గ్రౌండ్ లోకి ప్రవేశించారు.
పింక్ టెస్టు రెండో రోజున..
భారత్-శ్రీలంక మధ్య జరిగిన ఈ డే-నైట్ మ్యాచ్ రెండో రోజున ఈ ఘటన జరిగింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లోని ఆరో ఓవర్‌లో.. మహ్మద్ షమీ వేసిన బంతికి కుశాల్ మెండిస్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో, ఇద్దరు ఫ్యాన్స్ తమ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దగ్గరగా వెళ్లి.. సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. అంతలోనే పోలీసులు వారిద్దర్ని వెంబడించి బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ALso Read: Virat Kohli: పోలీసులకి చుక్కలు చూపించి మరీ.. విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగిన ఫాన్స్! చివరకు..!!
Also Read: IPL 2022: ఒక్కొక్కరుగా ఐపీఎల్ ను వీడుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. తలలు పట్టుకుంటున్న ఫ్రాంఛైజీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook