Virat Kohli: పోలీసులకి చుక్కలు చూపించి మరీ.. విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగిన ఫాన్స్! చివరకు..!!

Fans take a selfie with Virat Kohli. సీరియస్‌గా మ్యాచ్ జరుగుతుంటే ఓ ముగ్గురు అభిమానులు సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి పరుగులు తీసి విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2022, 11:59 AM IST
  • మైదానంలోకి దూసుకొచ్చిన ఫాన్స్
  • విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగిన ఫాన్స్
  • పోలీసులకి చుక్కలు చూపించి మరీ
 Virat Kohli: పోలీసులకి చుక్కలు చూపించి మరీ.. విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగిన ఫాన్స్! చివరకు..!!

IND vs SL, Fans take a selfie with Virat Kohli: ఒకప్పుడు అభిమాన క్రీడాకారులు బయట కనిపిస్తే.. ఫ్యాన్స్ ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడేవారు. తన ఫేవరెట్ క్రికెటర్ స్టార్ ఒక్క ఆటోగ్రాఫ్ ఇస్తే ఆ అభిమాని ఆనందానికి అవధులు ఉండేవి కావు. ఇప్పుడు ట్రెండ్ మారింది. సెల్ఫీల కాలం వచ్చేసింది. క్రికెట్ స్టార్లు కనిపిస్తే వెంటనే స్మార్ట్‌ ఫోన్ తీసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. సీరియస్‌గా మ్యాచ్ జరుగుతుంటే సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి పరుగులు తీశారు ఓ ముగ్గురు అభిమానులు. తన అభిమాన క్రికెటర్ దగ్గరకి వెళ్లి సెల్ఫీ దిగేశాడు. ఆదివారం జరిగిన భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు ఆటలో ఆదివారం రాత్రి మూడో సెషన్‌ జరుగుతుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో ముగ్గురు అభిమానులు ఒక్కసారిగా సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చారు. నేరుగా కోహ్లీ వద్దకు వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. అయితే విరాట్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా కాస్త దూరంగా ఉన్నాడు. బయోబబుల్‌లో ఉన్నందున తనను తాకకుండా సెల్ఫీలు తీసుకోమన్నాడు. ఇద్దరు యువకులు కోహ్లీతో ఫొటోలు దిగి సంతోషించారు. మరో అభిమాని విరాట్ వద్దకు వచ్చేసరికి సెక్యూరిటీ సిబ్బంది వచ్చారు. 

మైదానంలో ఉన్న ముగ్గురు అభిమానులను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవడానికి పరుగులు తీశారు. ఓ అభిమాని అయితే ఎవరికీ దొరకకుండా తప్పించుకున్నాడు. మైదానం మొత్తం కలియతిరుగుతూ చుక్కలు చూపించాడు. కొంత సేపటికి అతడిని పట్టుకున్నారు. ఆపై మరో ఇద్దరిని పట్టుకుని బయటికి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరూ ఒకసారి చూసి ఎంజాయ్‌ చేయండి. ఐపీఎల్ ప్రారంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో భాగమైన విరాట్ కోహ్లీకి చిన్నస్వామి స్టేడియం రెండో సొంత మైదానం. ఇక్కడి అభిమానులతో అతనికి ప్రత్యేక అనుబంధం ఉంది. 

రెండో టెస్టులో ఆధిపత్యాన్ని కొనసాగించిన భారత్‌.. ఘన విజయం దిశగా సాగుతోంది. రెండో రోజైన ఆదివారం శ్రేయస్‌ అయ్యర్‌ (67), రిషబ్ పంత్‌ (50), రోహిత్‌ శర్మ (46) ఆకట్టుకోవడంతో భారత్ 303/9 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకొని శ్రీలంకకు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి లంక 28/1తో నిలిచింది. మ్యాచ్ దాదాపుగా ఈరోజు ముగిసే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: Vikram Release Date: మేకింగ్ వీడియో అదుర్స్.. 'విక్రమ్' వచ్చేస్తున్నాడు!!

Also Read: Janasena Avirbhava Sabha: నేడు జనసేన ఆవిర్భావ సభ.. భావికార్యాచరణపై పవన్‌ ప్రకటన!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News