England Captain Kraigg Brathwaite played 710 minute Long Test innings vs England: టీ20 ఫార్మాట్ వచ్చాక.. క్రికెట్ ఆట స్వరూపమే పూర్తిగా మారిపోయింది. క్రీజులోకి రావడమే ఆలస్యం బంతిని బాదామా, పరుగులు చేశామా అన్న విధంగా మారిపోయింది. దాదాపుగా వన్డేలలో కూడా ఇదే కొనసాగుతోంది. ఇక టెస్ట్ ఫార్మాట్‌లో అయితే సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు అప్పుడపుడు చూస్తున్నా.. మారథాన్‌ ఇన్నింగ్స్ చూసి చాలా ఏళ్లు అయింది. బ్రియాన్‌ లారా, రాహుల్ ద్రవిడ్ ఆడే ఇన్నింగ్స్‌లు ఈ మధ్య లేనేలేవు. తాజాగా మారథాన్‌ ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్‌ కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ అందరిని ఆకట్టుకున్నాడు. తన ఆటతో దిగ్గజాలను గుర్తుచేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బార్బడోస్ వేదికగా వెస్టిండీస్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 9 వికెట్లకు 507 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (4) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ మాత్రం నిలకడగా ఆడాడు. షమర్ బ్రూక్స్, జెర్మన్ బ్లాక్ వుడ్ అండతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ ఇద్దరి అనంతరం వరుసగా వికెట్లు పడుతున్నా.. బ్రాత్‌వైట్‌ క్రీజులో నిలబడ్డాడు. ఒంటరి పోరాటం చేస్తూ మారథాన్‌ ఇన్నింగ్స్ ఆడాడు. 710 నిమిషాల పాటు క్రీజులో ఉండి 489 బంతులెదుర్కొని 160 పరుగులు చేశాడు. 


ఈ ఇన్నింగ్స్‌తో క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ విండీస్‌ దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. బ్రియాన్‌ లారా, రామ్‌నరేశ్‌ శర్వాన్‌, ఎఫ్‌ఎమ్‌ వోర్రెల్‌ సరసన బ్రాత్‌వైట్‌ చేరాడు. 1994లో ఇంగ్లండ్‌పై 375 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడిన లారా.. దాదాపు 766 నిమిషాల పాటు క్రీజులో ఉన్నాడు. 2004లో  ఇంగ్లండ్‌పైనే 400 పరుగులు నాటౌట్‌ (క్వాడప్రుల్‌ సెంచరీ) చేశాడు. ఈసారి 778 నిమిషాల పాటు క్రీజులో ఉండి ప్రపంచరికార్డు నెలకొల్పాడు. శర్వాన్‌ 2009లో ఇంగ్లండ్‌పై 698 నిమిషాల పాటు బ్యాటింగ్‌ చేసి 291 పరుగులు సాధించాడు. ఇక 1960లో వోర్రెల్‌ బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా 682 నిమిషాల పాటు బ్యాటింగ్‌ చేసి 197 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు.



తాజాగా క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ 710 నిమిషాల పాటు బ్యాటింగ్‌ చేసి.. 160 పరుగులు చేశాడు. దాంతో మారథాన్‌ ఇన్నింగ్స్ ఆడిన జాబితాలో రెండో స్థానంకు చేరుకున్నాడు. బ్రాత్‌వైట్‌ ఆటకు క్రికెట్‌ అభిమానులు ఫిదా అయ్యారు. చాలా రోజుల తర్వాత గొప్ప ఇన్నింగ్స్ ఆడిన బ్రాత్‌వైట్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 'సాహో బ్రాత్‌వైట్‌', 'నీ ఇన్నింగ్స్‌కు.. ఓ సలాం', 'టెస్టు క్రికెట్‌ అంటే ఇదే కదా', 'మారథాన్‌ ఇన్నింగ్స్ సూపర్', 'దిగ్గజాలను గుర్తుకుతెచ్చావు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 


Also Read: Samantha Yashoda Movie: సమంత 'యశోద' సినిమాకు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్!!


Also Read: Vijay Beast Movie: 'బీస్ట్‌' సెకండ్​ సింగిల్ వచ్చేసింది.. విజయ్ గాత్రం, స్టెప్పులు అదిరిపోయాయి (వీడియో)!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook