National Cricket Academy Director: నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ) డైరెక్ట‌ర్‌గా ఇప్పటి వరకు పని చేసిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid Cricket Academy).. ప్రస్తుతం భారత జట్టుకు ప్రధాన కోచ్ గా నియామకం అయ్యాడు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని క్రికెట్ అకాడమీ డైరెక్టర్ బాధ్యతల నుంచి ద్రవిడ్ తప్పుకున్న క్రమంలో ఆ స్థానంలో ఎవర్ని నియమిస్తారని క్రికెట్ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఎన్‌సీఏ డైరెక్టర్ గా టీమిండియా మాజీ క్రికెటర్‌, హైద‌రాబాదీ స్ట‌యిలిష్ బ్యాటర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ పేరు దాదాపుగా ఖరారైనట్లు ఇటీవలే ప్రచారం జరిగింది.  ఇప్పుడదే విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. నేషనల్ క్రికెట్ అకాడమీకి నూతన డైరెక్టర్ గా వీవీఎస్ లక్ష్మణ్ ను నియమిస్తున్నామని స్పష్టం చేశాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ఇండియా కోచ్ గా ద్రవిడ్..


టీమిండియా పురుషుల జట్టు హెడ్‌ కోచ్‌గా (Team India New Head Coach) భారత మాజీ కెప్టెన్‌, సీనియర్ క్రికెటర్​ రాహుల్‌ ద్రవిడ్‌ ఎంపికయ్యారు. ఇదే విషయాన్ని బీసీసీఐ (BCCI on New Head coach) ఇటీవలే అధికారికంగా ప్రకటన చేసింది. హెడ్​ కోచ్​గా ఉన్న రవిశాస్త్రి (Ravi Sharstri) శనివారం నుంచి ఆ బాధ్యతల నుంచి తప్పుకోగా.. రవిశాస్త్రి సేవలకు గాను బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడా స్థానంలో రాహుల్ ద్రవిడ్​ కోచ్​గా బాధ్యతలు స్వీకరించనున్నారు.


టీమ్ ఇండియా కోచ్​ పదవికి గత నెల బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించగా.. రాహుల్ తన అప్లికేషన్​ను దాఖలు చేశారు. అప్పటి నుంచే రాహులు తదుపరి కోచ్ అని ప్రచారం సాగింది. ఆ అంచనాలను నిజం చేస్తూ.. ద్రవిడ్​ను లాంఛనంగా ఎంపిక చేసింది. ఆర్పీ సింగ్‌, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తి చేసి ఏకగ్రీవంగా ద్రవిడ్‌ను సెలెక్ట్ చేసింది.


ఆ సిరీస్ నుంచి బాధ్యతల్లో ద్రవిడ్..


స్వదేశంలో నవంబర్‌ 17న ప్రారంభంకానున్న న్యూజిలాండ్‌ సిరీస్‌ నుంచి ద్రవిడ్‌ హెచ్​ కోచ్​గా బాధ్యతలు చేపడతాడని బీసీసీఐ తెలిపింది. 2023 వన్డే ప్రపంచకప్‌ వరకూ కోచ్​గా రాహుల్ ఉంటారని వివరించింది. నిజానికి గతంలోనే రాహుల్ ద్రవిడ్​ను ప్రధాన కోచ్​గా ఎంపిక చేయాలని బీసీసీఐ అనుకుంది. అయితే ఈ ఆఫర్​ను ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు సౌరభ్‌ గంగూలీ చొరవతో ద్రవిడ్​ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.  


Also Read: T20 World Cup 2021 Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో గెలిచేదెవరు?


Also Read: T20 World Cup Final 2021: ‘టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆ టీమ్ గెలవడం ఖాయం!’


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook