T20 World Cup Final 2021: ‘టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆ టీమ్ గెలవడం ఖాయం!’

T20 World Cup Final 2021: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచే అవకాశం ఉందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్ణణ్ జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్ టీమ్ లో డేవాన్ కాన్వే ఆడకపోవడం వల్ల ఆ టీమ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 04:52 PM IST
T20 World Cup Final 2021: ‘టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆ టీమ్ గెలవడం ఖాయం!’

T20 World Cup Final 2021: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ (T20 World Cup 2021 Final) కు సమయం ఆసన్నమైంది. ఆదివారం దుబాయ్‌ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో విజేత ఎవరో తేలిపోనుంది. ఫైనల్ చేరిన న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లు (Australia Vs New Zeland) తమ తొలి టీ20 టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఆస్ట్రేలియాకే ఎక్కువగా ఉన్నాయని మాజీ క్రికెటర్‌ వీవీఎస్ లక్ష్మణ్‌ జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే చేతి గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు దూరం కావడం కివీస్ జట్టుపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు.

“టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ చేరిన ఇరు జట్లలో ఆస్ట్రేలియా జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌ జట్టులో కీలక ఆటగాడైన డెవాన్ కాన్వే గాయపడటం ఆ జట్టుపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ, టాస్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, టీ20 క్రికెట్లో టాస్ గెలిచినంత మాత్రాన విజయం సాధిస్తామనే అంచనాకు రాలేం. ఒక్కోసారి మెరుగ్గా రాణించిన జట్టు కూడా ఓటమి పాలు కావొచ్చు” అని వీవీఎస్ లక్ష్మణ్‌ అన్నాడు. 

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో కివీస్ విజయంలో డెవాన్ కాన్వే (46) కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఔటైన తర్వాత కాన్వే (Devon Conway Injury) అసహనంతో బ్యాట్‌తో కుడి చేతికి బలంగా కొట్టుకోవడం వల్ల గాయమైంది. దీంతో అతడు ఫైనల్‌తో పాటు.. త్వరలో టీమిండియాతో జరుగనున్న టీ20 సిరీస్‌కు కూడా దూరమైన విషయం తెలిసిందే. 

Also Read: Zainab Abbas On Siraj: సిరాజ్ బౌలింగ్ కు ఫిదా అయిన పాకిస్థానీ యాంకర్

Also Read: BCCI on Virat Kohli: 'వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్​ కోహ్లీని తప్పించే యోచనలో బీసీసీఐ!' 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News