IPL 2022 Eliminator: కార్తీక్ క్యాచ్ వదిలేసిన రాహుల్, మెుదట చప్పుట్లు కొట్టి.. క్షణాల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన గంభీర్, వీడియో వైరల్
LSG vs RCB IPL 2022 Eliminator: ఐపీఎల్ ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనికి రాహుల్ సేన స్వీయ తప్పిదాలే కారణంగా కనిపిస్తోంది.
LSG vs RCB IPL 2022 Eliminator: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో (IPL 2022 Eliminator) లక్నో సూపర్ జెయింట్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఘన విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం (మే 25) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో 14 పరుగులు తేడాతో రాహుల్ సేన ఓడిపోయి..ఐపీఎల్ (IPL 2022) నుండి నిష్క్రమించింది. రాహుల్ 79 పరుగులతో రాణించిన జట్టును గెలిపించలేకపోయాడు. అయితే లక్నో టీమ్ (Lucknow Super Giants) ఫీల్డింగ్ తప్పిదాలే వారి కొంపముంచాయి. దినేష్ కార్తీక్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను కెప్టెన్ కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. ఆ సమయంలో డగౌట్ లో ఉన్న ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కనిపించాడు.
ఆర్సీబీ ఇన్నింగ్స్ 15వ ఓవర్ ను మొహ్సిన్ ఖాన్ వేస్తున్నాడు. ఆ సమయంలో కెప్టెన్ రాహుల్ (KL Rahul) మిడ్ ఆఫ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. అప్పుడే క్రీజ్ లోకి వచ్చిన దినేష్ కార్తీక్ మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో తడబడి..లీడింగ్ ఎడ్జ్ అందుకున్నాడు. బంతి గాల్లోకి లేచింది. దాంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ పక్కకి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోబోయాడు. బంతి అతని చేతుల్లోకి వచ్చినట్లు వచ్చి ఆఖరి క్షణంలో జారిపోయింది. ఆ సమయంలో డగౌట్‌లో ఆనందంతో చప్పట్లు కొట్టిన గంభీర్ (Gautam Gambhir)...క్షణాల్లో బంతి నేలపాలు అవ్వడంతో ముఖాన్ని చేతులతో దాచుకుంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.
Also Read; IPL Eliminator Match: లక్నోపై బెంగళూరు విక్టరీ... 14 పరుగుల తేడాతో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి