Sushant, Priya Anand starrer Maa Neella Tank Web Series Trailer released: అక్కినేని యువ హీరో సుశాంత్ కెరీర్ ఆరంభం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. కరెంట్, అడ్డా, చులసౌ లాంటి సినిమాలతో పర్వాలేదనిపించినా.. కమర్షియల్ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న సుశాంత్.. అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురంలో'లో సెకండ్ హీరోగా కనిపించి మెప్పించాడు. ఇప్పుడు మాస్ రాజా రవితేజ నటిస్తున్న 'రావణాసుర'లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటివరకూ వెండితెర అలరించిన సుశాంత్‌.. ఇకపై ఓటీటీలోనూ సందడి చేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుశాంత్ త్వరలోనే 'మా నీళ్ల ట్యాంక్' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌కు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ జీ 5లో జులై 15 నుంచి ఈ సిరీస్ అందుబాటులో ఉండనుంది. ప్రొమోషన్ కార్యక్రమంలో భాగంగా చిత్ర యూనిట్ నేడు మా నీళ్ల ట్యాంక్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే రిలీజ్ చేశారు. 


రెండు నిమిషాల 5 సెకండ్ల నిడివి గల మా నీళ్ల ట్యాంక్ ట్రైలర్.. 'దారుణం జరిగిపోతున్నాదాడ.. దారుణం జరిగే ఊరేనా ఇది. ఏమై ఉంటాది మీ ఇంట్లో కోడి పక్కింటోడి ఇంట్లో గుడ్డుపెట్టి ఉంటాది. ఇక నేను పీకేదేముందటి నా ఎన్సీసీ టోపీ మీది ఇక' అనే డైలాగ్‌తో ఆరంభం అయింది.నేను పైకొచ్చానంటే సంసారానికి బానికిరాకుండా పోతావ్, సురేఖ దొరికేదాకా నేనీడ నుంచి దిగేదే లే, ఒరేయ్ వంశీగా గేలానికి చిక్కిన చేప జారిపోవడం నీ జాతకంలోనే ఉందిరా, అతిగా ఆశపడే అత్త అస్సలు ఆశపడని కోడలు బాగుపడినట్లు చరిత్రలోనే లేదు అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 



ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న మా నీళ్ల ట్యాంక్ సిరీస్‌లో సుశాంత్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. సుశాంత్ రాయలసీమ యాసలో ఇదరగదీశాడు. చాలా కాలం తర్వాత ప్రియా ఆనంద్ తెలుగులో నటిస్తుంది. సుదర్శన్‌, దివి, నిరోషా, ప్రేమ్‌సాగర్‌, అన్నపూర్ణమ్మ, రామారాజు, అప్పాజీ, చంద్రమౌళి, వారణాసి, లావణ్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్ ఈ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలు పెంచింది. 


Also Read: IND VS ENG 2nd T20: టీ20ల్లో అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్, కోహ్లీ.. టాప్‌లో ఐర్లాండ్ ఆటగాడు!


Also Read: Rashmika Mandanna: లక్కు తోక తొక్కిన రష్మిక.. మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్.!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook