రెండేళ్ల ఓ చిన్నారి ఆటను అభినందిస్తూ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. 'స్ట్రైట్ డ్రైవ్, లాఫ్టేడ్ షాట్స్, ఫ్లిక్స్. ఎ ఫర్ఫెక్ట్ మాడ్రన్ డే ప్లేయర్, గ్రేట్ స్టార్ హాషిమ్. కీప్ ప్లేయింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ ది స్పోర్ట్' అంటూ ఆశీస్సులు తెలిపారు. కాగా క్రికెట్ ఆడుతున్న ఈ బుడతడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సచిన్ అభిమాని ఒకరు.. తన మేనల్లుడైన రెండేళ్ల బుడతడు క్రికెట్ ఆడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్ లకు ట్యాగ్ చేశాడు. ఈ వీడియోను చూసిన వెంటనే సచిన్ పై విధంగా రిప్లై ఇచ్చాడు. ఇష్టమైన ఆటను ఆడాలని దేశ పౌరులను కోరారు సచిన్.