Mithali Raj Retirement: భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జరగబోయే మహిళా క్రికెట్ టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆమె క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిథాలీ రాజ్ ఈ విధంగా స్పందించింది. తన రిటైర్మెంట్ తర్వాత ప్రతిభావంతులలైన క్రికెటర్లతో మహిళా జట్టు బలంగా మారుతుందని ఆమె చెప్పుకొచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"టీ20 వరల్డ్ కప్ తర్వాత నేను క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాను. నా రిటైర్మెంట్ తర్వాత ప్రతిభావంతులైన క్రికెటర్లతో మహిళల జట్టు మరింత బలంగా మారుతుందని ఆశిస్తున్నా. నా స్థానంలో టాలెంట్ ఉన్న యువ క్రికెటర్లకు అవకాశం దక్కుతుంది" అని మిథాలీ రాజ్ స్పష్టం చేసింది. 


తాజాగా న్యూజిలాండ్ టీమ్ తో భారత మహిళల జట్టు ఆడిన వన్డే తర్వాత తన మనసులోని మాటను బయటపెట్టింది. కివీస్ తో జరిగిన 5 మ్యాచుల వన్డే సిరీస్ లో 4-1 తేడాతో టీమ్ఇండియా ఓటమి పాలైంది. చివరి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో భారత మహిళా క్రికెట్ జట్టు గెలుపొందింది. ఇందులోప్లేయర్​ ఆఫ్ ది మ్యాచ్​ గా స్మృతి మంధాన నిలిచింది.


మిథాలీ రాజ్ కెరీర్


మిథాలీ రాజ్.. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో ఇప్పటి వరకు 222 వన్డేల్లో టీమ్ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించి, 7,516 పరుగులు రాబట్టింది. అత్యధిక స్కోరు 125 నాటౌట్ గా ఉంది. అందులో 7 సెంచరీలు, 61 అర్ధ శతకాలు ఉన్నాయి. కెరీర్ లో 12 టెస్టులు ఆడి 699 రన్స్ సాధించింది మిథాలీ రాజ్. అందులో ఒక శతకం, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఈ ఫార్మాట్ లో మిథాలీ రాజ్ నెలకొల్పిన అత్యధిక స్కోరు 214 పరుగులు. మరోవైపు పొట్టి ఫార్మాట్ (టీ20) టీమ్ఇండియా తరఫున 89 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్.. 2,364 పరుగులను సాధించింది. వాటిలో 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  


Also Read: IPL Australia Players: ఈ ఏడాది ఐపీఎల్ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు దూరం?


Also Read: Mithali Raj: భరతనాట్యం నుంచి క్రికెట్ వరకూ సాగిన మిథాలీ రాజ్ కెరీర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook