IPL Australia Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022కు ఆస్ట్రేలియా క్రికెటర్లు దూరం కానున్నారని సమాచారం. ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, జోష్ హేజిల్ వుడ్, పాట్ కమిన్స్ సహా మరికొంతమంది క్రికెటర్లు.. మార్చిలో జరగనున్న ఐపీఎల్ 2022లో కొన్ని మ్యాచులకు దూరం కానున్నారని తెలుస్తోంది. ఐపీఎల్ 2022 జరిగే సమయంలో ఆసీస్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అందుకే ఆస్ట్రేలియా టీమ్ కు చెందిన స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ లో కొన్ని మ్యాచులను ఆడకపోవచ్చని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఆస్ట్రేలియా, పాకిస్థాన్ టీమ్స్ మధ్య జరగనున్న ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా.. ఇరు జట్లు మూడు టెస్టులు (మార్చి 4 నుంచి 25 వరకు), మూడు వన్డేలు (మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 వరకు), ఏప్రిల్ 5న ఒక టీ20 మ్యాచ్ జరగనుంది. ఆసీస్ జట్టులోని కీలక ఆటగాళ్లైన డేవిడ్ వార్నర్, జోష్ హేజిల్ వుడ్, పాట్ కమిన్స్.. పాకిస్థాన్ తో టెస్టు సిరీస్ లో పాల్గొననున్నారు. ఆ తర్వాత వన్డే సిరీస్ లోనూ వీళ్లూ ఆడాల్సి ఉండగా.. ఐపీఎల్ కోసం భారత్ కు వచ్చే అవకాశం ఉంది. దీంతో వీరందరూ ఏప్రిల్ మొదటి వారం నుంచి ఐపీఎల్ లో ఆడనున్నారని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం.. క్రికెట్ ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదుర్చుకున్న క్రికెటర్లు అంతర్జాతీయ సిరీస్ లలో కాకుండా మరే టోర్నీలో ఆడేందుకు అనుమతి లేదు. ఈ కారణంగా ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ లో కొన్ని మ్యాచులకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 12, 13న జరిగిన ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లైన డేవిడ్ వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్, జోష్ హేజిల్ వుడ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పాట్ కమిన్స్ ను కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు సొంతం చేసుకున్నాయి. మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోని క్రికెటర్లు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఐపీఎల్ లో పాల్గొనవచ్చు.
Also Read: Team India bowling coach: టీమిండియా కొత్త బౌలింగ్ కోచ్‌గా అజిత్ అగార్కర్?
Also Read: Pushpa: ఇంకా తగ్గని 'పుష్ప' మేనియా.. తగ్గేదేలే అంటున్న రాజస్థాన్ రాయల్స్ టీమ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook