Mohammad Amir retires from international cricket: పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ అమీర్ (28) కీలక నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించి, అందరికీ షాకిచ్చాడు ఫాస్ట్ బౌలర్ అమీర్. 2009లో పాకిస్తాన్ జాతీయ జట్టులోకి పిన్న వయసులోనే అరంగేట్రం చేశాడు. జట్టుకు ప్రధాన పేసర్‌గా ఎదిగాడు. గతేడాది టెస్టులకు రిటర్మెంట్ ప్రకటించిన పేసర్.. ప్రస్తుతం అతి తక్కువ వయసులోనే ఓవరాల్‌గా రిటైర్మైంట్ ప్రకటించడం పాకిస్తాన్ క్రికెట్‌లో వివాదాస్పదమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Funny Memes On Prithvi Shaw: జూనియర్ సచిన్ పృథ్వీ షాపై పేలుతున్న జోక్స్


 


అమీర్ 30 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లలో పాకిస్తాన్ (Pakistan) జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 119 వికెట్లు, వన్డేల్లో 81, టీ20ల్లో 59 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు మహ్మద్ అమీర్ (Mohammad Amir). ఇటీవల లంక ప్రీమియర్ లీగ్‌లో సైతం పేసర్ అమీర్ ఆడాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనకు పాకిస్తాన్ జట్టులో అమీర్‌కు చోటు దక్కలేదు. దీంతో ఇలాంటి మేనేజ్‌మెంట్ కింద తాను ఆడలేనని తెలుపుతూ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం గమనార్హం.


Also Read: Forbes 2020 Worlds Highest Paid Celebrities: బావను వెనక్కినెట్టి మరీ టాప్ లేపిన ముద్దుగుమ్మ! 



టార్చర్ అనుభవించా: అమీర్
2010లో ఇంగ్లాండ్ పరట్యనకు వెళ్లిన మహ్మద్ అమీర్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. ఆరోపణలు నిజమని తేలడంతో ఐదేళ్ల నిషేధం విధించారు. కెరీర్ ముగిసిందని అంతా భావించగా.. జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా టాపార్డర్‌ను కట్టడి చేసి పాకిస్తాన్‌కు విజయాన్ని అందించాడు. కానీ గతేడాది తనకు టార్చర్ ఎక్కువైందని, ఈ వేధింపులు భరించలేనంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాది టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వడం పాక్ క్రికెట్ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది.


Also Read: Virat Kohli: దిగ్గజాలకే అందనంత ఎత్తులో విరాట్ కోహ్లీ.. గణాంకాలే సాక్ష్యాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook