లాహోర్ లో మంచు కురవొచ్చేమో గానీ, భారత్ పాక్ ల మధ్య ద్వైపాక్షిక సీరీస్ కష్టమే... గవాస్కర్
ముంబై: ఉగ్రవాదం కారణంగా భారత్ చాలా సంవత్సరాల క్రితమే పాకిస్థాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లకు కొనసాగించడానికి ముందుకు రాలేదు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నీల్లో పాక్ తో ఆడుతోన్నప్పటికీ
ముంబై: ఉగ్రవాదం కారణంగా భారత్ చాలా సంవత్సరాల క్రితమే పాకిస్థాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లకు కొనసాగించడానికి ముందుకు రాలేదు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నీల్లో పాక్ తో ఆడుతోన్నప్పటికీ ప్రత్యేకమైన సిరీస్ లేవి జరగలేదు. భారత మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం ఇదే అంశంపై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also read : ఎంసెట్, ఐసెట్, పాలిసెట్, పీజీసెట్, లా సెట్ పరీక్షలకు తేదీలు ప్లానింగ్ ?
పాకిస్థాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజాకు చెందిన యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు ఇప్పట్లో జరగడం చాలా కష్టమని, కొన్ని సంవత్సరాల వరకు జరిగే అవకాశాల్లేవని స్పష్టం చేశారు. అయితే గవాస్కర్ తనదైన శైలిలో మరో వ్యంగాస్త్రం సంధించాడు. అదేంటంటే.. లాహోర్ నగరంలో మంచు కురవొచ్చేమో కానీ భారత్, పాక్ జట్ల మధ్య క్రికెట్ మాత్రం కష్టమేనని అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్ టోర్నీలు, ఇతర ఐసీసీ ఈవెంట్లలో రెండు జట్లు ఆడడం కొనసాగించాలని, కానీ ఓ సిరీస్ లో తలపడడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని తేల్చిచెప్పారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Read Also: Protest against lockdown: లాక్‌డౌన్‌కి వ్యతిరేకంగా భగ్గుమన్న నిరసన.. పోలీసుల లాఠీఛార్జ్