MS Dhoni: టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంఎస్ ధోనీ..? ముందు ఆ రూల్ పాటించాల్సిందే..!
MS Dhoni Team India Head Coach: రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ వేట ప్రారంభించింది. ఎంఎస్ ధోనీని కోచ్‌గా నియమిస్తారని రూమర్లు వస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది కుదరని పని. ధోనీ కోచ్ కావాలంటే చెన్నై జట్టుకు గుడ్‌బై చెప్పాల్సి ఉంటుంది.
MS Dhoni Team India Head Coach: టీ20 వరల్డ్ కప్ తరువాత టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. ద్రవిడ్ వారసుడిగా ఎవరు వస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ద్రవిడ్ మరోసారి కోచ్‌గా కొనసాగే అవకాశం లేకపోవడంతో బీసీసీఐ కొత్త కోచ్ పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రధాన కోచ్ పదవికి రాహుల్ ద్రవిడ్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని.. తాము దీర్ఘకాలిక కోచ్ కోసం చూస్తున్నామని బీసీసీఐ సెక్రటరీ జై షా ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. కనీసం మూడేళ్లు పదవిలో ఉండాలన్నారు. దీంతో రాహుల్ ద్రవిడ్ పదవిలో కొనసాగే అవకాశం లేదు.
Also Read: Doctors negligence: ఇదేం నిర్వాకం.. సర్జరీ చేసి పొట్టలో దూది మర్చిపోయిన డాక్టర్.. ఎక్కడో తెలుసా..?
ప్రస్తుతం ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేయడం కొంచె కష్టమే. అతనికి సరైన వారసుడి కోసం బీసీసీఐ అన్వేషణ ప్రారంభించింది. ప్రస్తుతం బెంగళూరులో NCA ప్రెసిడెంట్‌గా ఉన్న VVS లక్ష్మణ్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా టీమిండియా మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే కోచ్ పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా కోచ్ పదవిపై ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా హెడ్ కోచ్ అయ్యేందుకు ఎంఎస్ ధోనికి నిబంధనలు ఒప్పుకోవు. రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ధోని ఇంకా అధికారికంగా అర్హత సాధించలేదు. ధోనీ ఇంకా ఐపీఎల్‌లో కొనసాగుతున్నందున కోచ్‌గా దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లేదు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ.. కోచ్ కావాలంటే సీఎస్‌కేకు గుడ్ బై చెప్పాల్సి ఉంటుంది. ఐపీఎల్‌లో ఆటగాడిగా ఉన్నా.. 2021 టీ20 ప్రపంచకప్‌కు ధోనీని మెంటర్‌గా నియమించింది బీసీసీఐ. అయితే ఇందుకోసం ధోనీ ఎలాంటి డబ్బులు తీసుకోలేదు.
ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరుగుతోంది. అందుకే రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. అయితే ధోనీ రిటైర్మెంట్‌పై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. ఐపీఎల్ 2024 తర్వాత రిటైర్ అవుతాడా..? లేదా ఇంకా కొనసాగుతాడా..? అనేది సస్పెన్స్‌గా మారింది. ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనుంది. ఒకవేళ ధోనీ కొనసాగిలనుకుంటే చెన్నై టీమ్ తమతోనే ఉంచుకునే అవకాశం ఉంది. ధోనీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా.. చెన్నై జట్టుకు మెంటర్‌గా కొనసాగే అవకాశం ఉంది. ఐపీఎల్ లేని సమయంలో ధోనీ రాంచీలో వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నాడు.
Also Read: YS Jagan Foreign Trip: సీఎం వైఎస్ జగన్‌కు శుభవార్త.. విదేశీ ప్రయాణానికి సీబీఐ కోర్టు పచ్చజెండా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter