Doctors negligence: ఇదేం నిర్వాకం.. సర్జరీ చేసి పొట్టలో దూది మర్చిపోయిన డాక్టర్.. ఎక్కడో తెలుసా..?

Uttar pradesh: కడుపునొప్పిగా ఉందని ఒక వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు. అతడిని టెస్టులు చేసిన వైద్యులు పిత్తాశయంలో సమస్యలు ఉన్నాయని సర్జరీ చేయాలని చెప్పారు.  దీంతో అతను వైద్యులు సూచన మేరకు లోహియా నగర్ లోఉన్న నర్సింగ్ హోమ్ లో సర్జరీ చేయించుకున్నాడు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 14, 2024, 01:06 PM IST
  • సర్జరీ తర్వాత అవస్థల పాలైన వైద్యుడు..
  • డాక్టర్ ను చివాట్లు పెడుతున్న స్థానికులు..
Doctors negligence: ఇదేం నిర్వాకం.. సర్జరీ చేసి పొట్టలో దూది మర్చిపోయిన డాక్టర్.. ఎక్కడో తెలుసా..?

Uttar pradesh meerut doctor forgot cotton in stomach during surgery: చాలా మంది వైద్యులను దేవుళ్లుగా భావిస్తారు. దేవుడు జన్మనిస్తే, వైద్యుడు పునర్జన్మనిస్తాడని చెబుతుంటారు. మనకు ఏదైన అనుకోని ఆపద కలిగితే మన ప్రాణాలను కాపాడాలని వైద్యుడిని వేడుకుంటాం. డాక్టర్లు చాలా మంది కూడా తమదగ్గరకు వచ్చే పెషెంట్లకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ఎంతపెద్ద రోగం ఉన్న బాధితుడికి, ఏంకాదని ధైర్యం చెప్పి, అతడి ప్రాణాలకు ఇబ్బందులు కల్గకుండా కాపాడుతారు. ఈ నేపథ్యంలో.. కొందరు డాక్టర్లు మాత్రం వీటిని పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తారు. తమ వద్దకు వచ్చే రోగుల పట్ల పూర్తిగా నెగ్లీజేన్సీగా ఉంటారు. అంతేకాకుండా.. ఆస్పత్రులలో రోగులను అస్సలు పట్టించుకోరు. రోగులకు వచ్చిన రోగాన్ని అస్సలు డయాగ్నోసిస్ చేయరు. ఒక రకమైన బాధతో ఉంటే, మరోరకమైన టెస్టులు చేయిస్తుంటారు.

Read more: Viral Video: ఓవరాక్షన్ చేస్తే ఇట్లనే ఉంటది మరీ.. బొక్కొ బొర్లా పడిన యువకుడు.. వీడియో వైరల్..

అవసరం లేని టెస్టులు, స్కానింగ్ లు చేయించి వారి ఆస్పత్రులలో బిల్లులు కట్టించుకుంటారు. చివరకు ఎలాంటి రోగంలేదని చెప్పి వాళ్లు కూడా ఉన్నారు. మరికొందరు ఏదైన చిన్న సమస్యఉన్న ఏదో పెద్ద ప్రమాదం ఉన్నట్లు రోగిని భయపెడుతారు. అవసరంలేని సర్జరీలు చేసి బిల్లుల రూపంలో డబ్బులు దండుకుంటారు. ఇక మరోరకం క్యాటగిరీ ఉంటారు. వీళ్లు సర్జరీలు చేసేటప్పుడు పూర్తిగా నెగ్లీజెన్సీగా ఉంటారు. అంతేకాకుండా.. కడుపులో కాటన్ లు,కత్తెరలు, సర్జరీ ఐటమ్స్ లను మర్చిపోతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు..

ఉత్తర ప్రదేశ్ లోని మేరఠ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వైద్యుడి నిర్వాకంతో రోగి తీవ్రమైన అవస్థలు పడ్డాడు. మేరఠ్ కు చెందిన ఒక వ్యక్తి కడుపునొస్తుందని, లోహియానగర్ లోని నర్సింగ్ హోమ్ కు వెళ్లాడు. అతడిని టెస్టులు చేసిన వైద్యులు, పిత్తాశయంలో సమస్య ఉందని, సర్జరీ చేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో.. బాధితుడికి వైద్యులు కొన్నిరోజుల క్రితం సర్జరీ చేశారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత డిశ్చార్జీ చేశారు. అయితే.. ఇంటికి వెళ్లినప్పటి నుంచి రోగి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. భరించలేని నొప్పితో మరోక ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు స్కానింగ్ చేశారు. అందులో కడుపులో దూది ఉండటంను వైద్యులు గమనించారు. వెంటనే అతడిని శస్త్ర చికిత్స చేసి, దూదిని తొలగించారు.

Read more: Lady doctor with 2 men: మరో ఇద్దరితో రాసలీలలు.. హోటల్ గదిలో భర్తకు అడ్డంగా దొరికి పోయిన లేడీ డాక్టర్ .. వీడియో వైరల్..

ఈక్రమంలో.. బాధితుడి బంధువులు, లోహియానగర్ లోని నర్సింగ్ హోమ్ కు వెళ్లి డాక్టర్ ను నిలదీశారు.దీంతో ఆస్పత్రి వర్గాలు రోగుల బంధువులను పట్టించుకోలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం తీవ్ర కలకలంగా మారింది. ప్రాణాలు కాపాడాల్సిన స్థానంలో ఉండి, ఇలా ప్రవర్తించడమేంటని కూడా కొందరు వైద్యులపై మండిపడుతున్నారు. వెంటనే సదరు ఆస్పత్రి, వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News