టీమిండియా సీనియర్ ఆటగాడు ఎం.ఎస్ ధోనీ తన ఆటతీరుతో అకట్టులేకపోయాడనే కారణంతో బీసీసీఐ అతనిపై వేటు వేసిందనుకుంటున్నారా ? అసలు ఎం.ఎస్ ధోనీకి జట్టులో స్థానం దక్కకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..!!  ఇవన్నీ కాదులేండి.... మేటర్ తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరల్డ్ కప్ లో వివిధ జట్లకు చెందిన ఆటగాళ్ల ఫెర్ఫార్మెన్స్ ను పరిశీలించిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్...తన డ్రీమ్ టీమ్ ప్రకటించాడు. సచిన్ ప్రకటించిన జట్టులో టీమిండియా నుంచి  రోహిత్ శర్మ,  విరాట్ కోహ్లీ,  రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలకు చోటు దక్కింది. అయితే టీమిండియా క్రికెట్ దిగ్గజం, వికెట్ కీపర్ ధోనీకి మాత్రం చోటు దక్కలేదు.


ప్రస్తుత ఆటగాళ్ల  ఫాంను పరిగణనలోకి తీసుకొని మాత్రమే సచిన్ తన కలల జట్టును ప్రకటించాడు. ఇందులో ధోనీకి ప్లేస్ దక్కనంత మాత్రాన అభిమానలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.


సచిన్ వరల్డ్ XI టీం ఇదే...


కేన్ విలియమ్సన్ (కెప్టెన్),
 రోహిత్ శర్మ
 జానీ బెయిర్ స్టో ( వి.కీపర్ )
 విరాట్ కోహ్లీ
 షకీబల్ హసన్
 బెన్ స్టోక్స్
 హార్దిక్ పాండ్య
 రవీంద్ర జడేజా
 మిచెల్ స్టార్క్
 జోఫ్రా ఆర్చర్
 జస్ప్రీత్ బుమ్రా.