MS Dhoni: టీమిండియా ఆటగాళ్లకు ఎంఎస్ ధోని సడెన్ సర్‌ప్రైజ్
MS Dhoni Sudden Surprise To Team India Players: టీమిండియా ఆటగాళ్లకు మాజీ కెప్టెన్ ధోని సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. డ్రెసింగ్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆటగాళ్లతో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
MS Dhoni Sudden Surprise To Team India Players: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ జరగనుంది. రాంచీలో వేదికగా రాత్రి 7 గంటలకు రెండు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రాంచీ చేరుకున్న రెండు జట్లు ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. టీమిండియా నెట్ ప్రాక్టీస్ ముగించుకుని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతుండగా.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లతో మాట్లాడాడు. ధోని సొంతూరు రాంచీ కావడంతో జట్టు ఆటగాళ్లను కలిసేందుకు వచ్చాడు.
మొదట కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో మాట్లాడాడు ధోని. ఆ తర్వాత యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌కు సలహాలు ఇచ్చాడు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, సహాయక సిబ్బందితో కరచాలనం చేశాడు. టీమిండియా ఆటగాళ్లు కూడా తమ మాజీ కెప్టెన్‌ని చూసి చాలా సంతోషించారు. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్‌తో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తూ.. తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.
వన్డే సిరీస్‌ను గెలిచి ఊపు మీద ఉన్న భారత్.. టీ20 సిరీస్‌ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఈ సిరీస్ నుంచి కూడా సీనియర్లను తప్పించగా.. హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఇక తుది జట్టులో మార్పులపై గురువారం ప్రెస్‌మీట్‌లో క్లారిటీ ఇచ్చాడు పాండ్యా.
ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారని చెప్పాడు. మరో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా కొద్ది రోజులు ఎదురుచూడక తప్పదన్నాడు. ప్రస్తుతం శుభ్‌మన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని కొనియాడాడు. ధోని గురించి చెబుతూ.. 'మహీ భాయ్ ఇక్కడ ఉన్నాడు. అతనిని కలిసే అవకాశం మాకు లభించింది. మేం ఎప్పుడు కలిసినా.. క్రికెట్ కంటే పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ధోని నుంచి నేను చాలా నేర్చుకున్నాను..' అని చెప్పాడు.
తనకు కొత్త బంతితో బౌలింగ్ చేయడం చాలా ఇష్టమని హార్ధిక్ పాండ్యా అన్నాడు. తాను చాలా ఏళ్లుగా నెట్స్‌లో కొత్త బంతితో బౌలింగ్ చేస్తున్నానని.. పాత బంతితో బౌలింగ్ చేసే అలవాటు ఉంటే అంతగా ప్రాక్టీస్ చేయాల్సిన పనిలేదన్నాడు. ఇది మ్యాచ్ పరిస్థితులలో సహాయపడుతుందని చెప్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వడంతో హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్ బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: Ruturaj Gaikwad: టీమిండియాకు ఎదురుదెబ్బ.. కివీస్ టీ20 సిరీస్ నుంచి రుతురాజ్ ఔట్
Also Read: Ravindra Jadeja: రవీంద్ర జడేజా గ్రాండ్‌గా రీఎంట్రీ.. ఆసీస్ జట్టుకు హెచ్చరికలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook