Ravindra Jadeja: రవీంద్ర జడేజా గ్రాండ్‌గా రీఎంట్రీ.. ఆసీస్‌ జట్టుకు హెచ్చరికలు

Ravindra Jadeja in Ranji Trophy 2023: రంజీ ట్రోఫీలో బరిలోకి దిగిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఏడు వికెట్లతో చెలరేగాడు. తాను వందశాతం ఫిట్‌గా ఉన్నానని.. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌కు రెడీగా ఉన్నానని చెప్పాడు. ఈ పర్ఫామెన్స్‌తో తన ఫిట్‌నెస్‌పై అనుమానాలను తొలగించాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2023, 08:30 PM IST
  • ఏడు వికెట్లతో చెలరేగిన రవీంద్ర జడేజా
  • తమిళనాడుపై సూపర్ బౌలింగ్
  • ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌కు రెడీగా ఉన్నానని ప్రకటన
Ravindra Jadeja: రవీంద్ర జడేజా గ్రాండ్‌గా రీఎంట్రీ.. ఆసీస్‌ జట్టుకు హెచ్చరికలు

Ravindra Jadeja in Ranji Trophy 2023: గాయం కారణంగా జట్టుకు చాలా కాలంగా దూరంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. రంజీ ట్రోఫీలో బరిలోకి దిగిన జడేజా.. ఏడు వికెట్లు పడగొట్టి ఫిట్‌నెస్ నిరూపించుకున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23లో సౌరాష్ట్ర తరపున జడేజా ఆడుతున్నాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో గురువారం 7 వికెట్లు పడగొట్టి తన ఫామ్‌ను కోల్పోలేదని హెచ్చరికలు పంపించాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లు వేసిన జడేజా.. 48 పరుగులిచ్చి ఒక వికెట్ తీశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 17.1 ఓవర్లలో 53 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 3 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మొత్తం 8 వికెట్లతో చెలరేగాడు. సౌరాష్ట్ర, తమిళనాడు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసిన తర్వాత జడేజా స్పందించాడు. "నేను 100 శాతం ఫిట్‌గా ఉన్నాను. ప్రస్తుతం చాలా ఉత్సాహంగా ఉన్నా. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు పూర్తిగా సిద్ధంగా ఉన్నాను.." అని చెప్పాడు.  

నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు ఫిబ్రవరిలో భారత్‌కు రానుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసిన టీమిండియా జట్టులో రవీంద్ర జడేజాకు కూడా ప్లేస్ దక్కింది. అయితే ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని సెలెక్టర్లు కండీషన్ పెట్టారు. 

తాజాగా తమిళనాడుపై అద్భుత పర్ఫామెన్స్‌తో తన ఫిట్‌నెస్‌పై ఉన్న అనుమానాలను పటాపంచాలు చేశాడు. మోకాలి గాయం కారణంగా రవీంద్ర జడేజా ఆగస్టు 2022 నుంచి క్రికెట్ మైదానానికి దూరంగా ఉన్నాడు. ఆసియా కప్ 2022లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత.. మళ్లీ గ్రౌండ్‌లోకి బరిలోకి దిగలేదు. 

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్.

Also Read: Ruturaj Gaikwad: టీమిండియాకు ఎదురుదెబ్బ.. కివీస్ టీ20 సిరీస్ నుంచి రుతురాజ్ ఔట్  

Also Read: MLC Kavitha: గవర్నర్‌కు ధన్యవాదాలు చెబుతూ ఎమ్మెల్సీ కవిత కౌంటర్.. ట్వీట్ వైరల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News