Mumbai Former cricketer Rajesh Verma died due to cardiac arrest: ముంబై రంజీ జ‌ట్టు మాజీ పేస‌ర్ రాజేష్ వర్మ మృతి చెందారు. గుండె పోటుతో 40 ఏళ్ల వయసులోనే ఆదివారం ఆయన తీరరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విష‌యాన్ని రాజేష్ వర్మ మాజీ స‌హ‌చ‌ర ఆట‌గాడు భవిన్ థక్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. 2002లో ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఆయన అరంగేట్రం చేశారు. రాజేష్ వ‌ర్మ మరణంతో భారత క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. పలువురు క్రీడా ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన రాజేష్ వర్మ ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు. 7 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 23 వికెట్లు పడగొట్టారు. దీంట్లో ఓ ఫైవ్ వికెట్ హాల్ (5/97) కూడా ఉంది. రాజేష్ వర్మ త‌న చివ‌రి మ్యాచ్‌లో బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్‌తో ఆడారు. 2007లో రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై జ‌ట్టులో వ‌ర్మ సభ్యుడిగా ఉన్నారు. ముంబై తరఫున 11 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడిన వర్మ.. 20 వికెట్లు పడగొట్టారు. ఇక నాలుగు టీ20ల్లో ఐదు వికెట్లు తీశారు.


ముంబై రంజీ జ‌ట్టు మాజీ పేస‌ర్ రాజేశ్ వర్మ హఠాన్మరణం పట్ల అతని స్నేహితుడు భావని థక్కర్ విచారం వ్యక్తం చేశారు. 'రాజేష్ వ‌ర్మ మ‌ర‌ణ వార్త విని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. అండ‌ర్‌-19 నుంచి మేమిద్దరం క్రికెట్ ఆడాం. మంచి మిత్రులం. 20 రోజుల క్రితం కూడా ఇద్దరం కలిసి ఓ టోర్నమెంట్‌లో ఆడాం. నిన్న (ఏప్రిల్ 23) కూడా దాదాపు 30 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడా. ఈ రోజు  తెల్లవారుజామున 4 గంటలకు చనిపోయాడాని ఫోన్ వ‌చ్చింది. వర్మ మా కుటుంబానికి మంచి సన్నిహితుడు. మ‌మ్మల్ని విడిచి వెళ్లిపోవ‌డం చాలా బాధ‌గా ఉంది' అని థక్కర్ తెలిపారు.


Also Read: Ram Charan Upasana: చిరంజీవి అంటే భయమా లేదా ఉపాసననా.. తెలివైన సమాధానం ఇచ్చిన రామ్ చరణ్!


Also Read: Harihara Veeramallu: పవన్ కల్యాణ్​ 'హరిహర వీరమల్లు'లో బాలీవుడ్ హాట్​ బ్యూటీ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.