IPl 2022 MI vs GT: గుజరాత్ కు షాక్ ఇచ్చిన ముంబై, మ్యాజిక్ చేసినట్టే గెలిచిన రోహిత్ సేన
IPl 2022 MI vs GT: గుజరాత్ టైటాన్స్ కు ముంబై ఇండియన్స్ షాక్ ఇచ్చింది. చివరి ఓవర్ లో తొమ్మిది పరుగులు అవసరమైన సమయంలో ముంబై ఇండియన్స్ మ్యాజిక్ చేసింది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్ ను తమవైపునకు తిప్పుకుంది. ఫలితంగా లీగ్ లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.
IPl 2022 MI vs GT: ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు ముంబై పది మ్యాచులు ఆడగా కేవలం రెండింట్లో మాత్రమే గెలిచింది. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఇద్దరు కూడా మంచి ఓపెనింగ్ పార్ట్ నర్ షిప్ నమోదు చేశారు. ఇషాన్ కిషాన్ 29 బంతుల్లో 45 పరుగులు చేయగా.. 28 బంతుల్లో రోహిత్ 43 రన్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే టిమ్ డేవిడ్ మాత్రం గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 21 బంతుల్లో 44 పరుగులు చేశాడు. అందులో 2 ఫోర్లు 4 సిక్సులు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు ముంబై ఓపెనింగ్ పార్ట్‌నర్ షిప్ ను విడగొట్టేందుకు అష్టకష్టాలు పడ్డారు. చివరకు 74 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు, ఫెర్గూసన్, సంగ్వాన్ చెరో వికెట్ తీశారు.
ఆ తర్వాత లక్ష్య చేధనలో భాగంగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభమన్ గిల్ మాంచి భాగస్వామ్యం నెలకొల్పారు. సాహా 40 బంతుల్లో 55,గిల్ 36 బంతుల్లో 52 పరుగులు చేశారు. 106 పరుగుల వద్ద గుజరాత్ తన తొలి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా 24 రన్స్ తో పర్వాలేదనిపించాడు. అయితే సాయి సుదర్శన్, రాహుల్ తివాటియా స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేదు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి కేవలం 172 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ముంబై ఖాతాలో ఈ సీజన్ లో రెండో విజయం చేరింది. ముంబై బౌలర్లలో చివరి ఓవర్ వేసిన డానియల్ సామ్స్ అదరగొట్టాడు. మూడు ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. 21 బంతుల్లోనే 44 పరుగులు చేసిన టిమ్ డేవిడ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
Also Read: IPL 2022: లక్నోను ఢీ కొట్టేందుకు సిద్ధమైన కోల్ కతా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.