Ipl 2022 Punjab Kings VS Rajasthan Royals: శనివారం ఐపీఎల్ లో రెండు పవర్ ప్యాక్డ్ మ్యాచ్ లు జరగనున్నాయి. అందులో ఒకటి పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. శనివారం మధ్యాహ్నం మూడున్నరకు వాంఖడే వేదికగా మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ రెండు టీంలు కూడా ఇప్పటివరకు అద్భుతమైన ఆటతీరును కనబరుస్తున్నాయి. రాజస్థాన్ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 6 విజయాలు సాధించింది. 12 పాయింట్లతో టేబుల్ లో 3వ స్థానంలో ఉంది. ఇక పంజాబ్ ఆడిన 10 మ్యాచుల్లో 5 విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు తన చివరి మ్యాచ్ ను గుజరాత్ టైటాన్స్ ఆడింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక పంజాబ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే జానీ బెయిర్ స్ట్రో, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లివింగ్ స్టోన్, మయాంక్ అగర్వాల్ తో పటిష్టంగానే ఉంది. అయితే ధావన్ లివింగ్ స్టోన్ మాత్రమే నిలకడగా రాణిస్తున్నారు. వీరిద్దరే చెరో మూడు హాఫ్ సెంచరీలు చేశారు. కొన్ని మ్యాచుల్లో మాత్రమే కెప్టెన్ మయాంక్, రాజపక్స్ పర్వాలేదనిపించారు. ఇక పంజాబ్ బౌలింగ్ ప్రధాన బలం రబాడ. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో 17 వికెట్లు తీశాడు. ఆ తర్వాత స్పిన్ కోటా లో 10 మ్యాచ్ లు ఆడిన రాహుల్ చాహర్ 12 వికెట్లు పడగొట్టాడు. సందీప్ శర్మ, అర్షదీప్ సింగ్ ఉన్నప్పటికీ చెప్పుకునేంత పర్ఫామెన్స్ మాత్రం ఇవ్వడం లేదు.
ఇక రాజస్థాన్ జట్టు చివరి మ్యాచ్ కోల్ కతాతో ఆడి ఓటమిపాలైంది. రాజస్థాన్ ఓపెనర్ బట్లర్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. లీగ్ లో ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడిన బట్లర్ మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో భయంకరంగా కనిపిస్తున్నాడు. 588 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాత రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ సైతం పది మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక పదిక్కల్, హెట్ మెయిర్, రియన్ పరాగ్ లాంటి ఆటగాళ్లతో రాజస్థాన్ జట్టు మిడిలార్డర్ బలంగానే కనిపిస్తోంది. బౌలింగ్ లోనూ రాజస్థాన్ సత్తా చాటుతోంది. ఆ జట్టు స్పిన్నర్ చాహల్ ఆడిన 10 మ్యాచుల్లో 19 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ సైతం పది మ్యాచులు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు.ట్రెంట్ బౌల్ట్, అశ్విన్ లతో రాజస్థాన్ బౌలింగ్ విభాగం స్ట్రాంగ్ ఉందనే చెప్పుకోవాలి. మొత్తానికి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో వేచిచూడాలి.
Also Read:Amazon Samsung M12: రూ.549 ధరకే శాంసంగ్ గెలాక్సీ మొబైల్ అందుబాటులో!
Also Read:teenmar mallanna shocking decision: కేసీఆర్‌ను తిట్టనని ఒట్టేసిన తీన్మార్ మల్లన్న
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.