కరోనావైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అనే కాదు.. అన్ని రంగాలకు చెందిన వారు, వృత్తికారులు కరోనా దెబ్బకు కోలుకోలేని స్థితిలో ఉన్నారు. క్రీడారంగం కూడా కరోనా తాకిడికి అతలాకుతలం అయింది. క్రికెట్ విషయానికొస్తే.. ఒక్క ఐపిఎల్, బీబీఎల్ లాంటివి ఒకట్రెండు మినహా మిగతా అన్ని క్రికెట్ టోర్నమెంట్స్ వాయిదా పడ్డాయి. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్ కూడా కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐతే ఈ టీ20 వరల్డ్ కప్ ( ICC T20 World Cup 2020 ) వాయిదా పడిన కారణంగా ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్ కూడా రోడ్డున పడ్డాడు. బ్యాట్, బంతి పట్టుకుని తమ దేశం తరపున ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడటానికి బదులుగా ప్రస్తుతం బతుకుదెరువు కోసం ఉబర్ ఈట్స్‌లో ఫుడ్ డెలివరి బాయ్‌గా మారాడు. శీతాకాలం అన్ని రోజులు పూట గడిచిపోవడం కోసం తాను ఉబర్ ఈట్స్ ద్వారా ఫుడ్ డెలివరి బాయ్ ఉద్యోగం చేస్తున్నాను అంటూ నెదర్లాండ్స్‌కి చెందిన పాల్ వాన్ మీకెరన్ ( Paul Van Meekeran tweet ) చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Also read : Bigg Boss 4 Telugu: ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం !


క్రికెట్ ఆడాల్సిన వాడిని ఫుడ్ డెలివరి బాయ్‌గా మారాను అని ట్వీట్ చేసిన పాల్.. విధి ఎంత విచిత్రంగా మారుతుందో కదూ అని నిట్టూర్చాడు. అలాగని నిరాశపడొద్దనే సందేశాన్నిస్తూ.. కీప్ స్మైలింగ్ పీపుల్ అంటూ పాల్ తన ట్వీట్‌లో రాసుకొచ్చిన కామెంట్ చూస్తే.. నిజమే బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు కావడానికి ఎంతో సమయం పట్టదేమో అనిపించకమానదు. ఏదేమైనా కరోనావైరస్ ( Coronavirus ) తీసుకొచ్చిన లాక్‌డౌన్ ఎంత పనిచేసింది చూడండి.. విధి ఆడిన వింత నాటకంలో ఓ ఇంటర్నెషనల్ క్రికెటర్ ఇవాళ గల్లీల్లో తిరుగుతూ ఫుడ్ డెలివరీ చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఒకరిని దోచుకోనంత వరకు కష్టపడి చేసే పని ఏదైనా తప్పు కాదు అనే గొప్ప సందేశాన్ని కూడా ఇచ్చాడు పాల్.


Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి