ICC World Cup 2023 Qualifier Highlights: పన్నెండేళ్ల తర్వాత  భారత్‌ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్‌ అర్హత సాధించింది. స్కాట్లాండ్ పై అద్భుతమైన విజయం సాధించిన నెదర్లాండ్స్.. ఐదోసారి  ఈ మెగాటోర్నీలో అడుగుపెట్టనుంది. గురువారం ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శన చేసిన నెదర్లాండ్స్‌ 4 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై గెలుపొందింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్  50 ఓవర్లలో 9 వికెట్లకు 277 పరుగులు చేసింది. బ్రాండన్‌ మెక్‌ములెన్‌ (106; 110 బంతుల్లో 11×4, 3×6) సెంచరీతో సత్తా చాటగా...కెప్టెన్‌ బెరింగ్టన్‌ (64) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే 44 ఓవర్లలోపే నెదర్లాండ్స్ లక్ష్యాన్ని చేధించాలి. కానీ 31 ఓవర్లకు 164/5తో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.  అప్పటికీ లీడ్‌ 52 బంతుల్లో 47 పరుగులతో ఉన్నాడు. అయితే నెదర్లాండ్స్ గెలుస్తుందని నమ్మకం ఎవరికీ లేదు. దీంతో గేరు మార్చిన  లీడ్‌ బౌండరీలు, సిక్సర్ లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. సకీబ్‌ (33 నాటౌట్‌)తో కలిసి అతను ఆరో వికెట్‌కు 11.3 ఓవర్లలోనే 113 పరుగులు జోడించాడు. దీంతో 42.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి నెదర్లాండ్స్ ప్రపంచకప్‌ కు అర్హత సాధించింది. 


శ్రీలంక ఇప్పటికే వరల్డ్ కప్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నెదర్లాండ్స్‌ (నెట్‌ రన్‌రేట్‌ 0.160)తో పాటు స్కాట్లాండ్‌ (0.102), జింబాబ్వే (-0.099) తలో 6 పాయింట్లతో సమానంగా నిలిచాయి. కానీ మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ ఉన్న కారణంగా నెదర్లాండ్స్‌ ప్రపంచ బెర్త్ ఖాయం చేసుకుంది. ఆ టీమ్ 1996, 2003, 2007, 2011 ప్రపంచకప్‌ల్లో పాల్గొంది. 


Also Read: Tamim Iqbal Retirement: తమీమ్ ఇక్బాల్ షాకింగ్ నిర్ణయం.. మూడు ఫార్మాట్లకు గుడ్‌బై



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి